Hyper Aadi interesting comments about Pawan Kalyan.
Hyper Aadi: జబర్దస్త్ హైపర్ ఆది గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన గురించి, ఆయన చేసే కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ఓపక్క సినిమాలు చేస్తూనే టీవీ షోలలో తన మార్క్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైనర్ చేస్తూ ఉంటారు. అయితే, హైపర్ ఆదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఈమధ్య ఏర్పడింది కాదు.
కాలేజ్ డేస్ నుంచి పవన్ అంటే పిచ్చిని పెంచుకున్నాడు ఆది. ఆ తరువాత జబర్దస్త్ ద్వారా నాగ బాబుకి దగ్గరై ఇప్పుడు జనసేనకు సపోర్ట్ గా తన వాయిస్ వినిపిస్తున్నాడు. గత ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశాడు. హైపర్ ఆది(Hyper Aadi) మాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. మైక్ పట్టుకున్నాడు అంటే తన మాటలతో ఆడేసుకుంటాడు. కేవలం పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయడమే కాదు. ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారా అంతే.
Thalaivar 173: రజనీ-కమల్ మూవీ అప్డేట్.. యంగ్ డైరెక్టర్‌కి ఛాన్స్.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు
మైక్ తీసుకొని రెడీ అయిపోతాడు ఆది. పవన్ పై ఒక్క మాట పడనివ్వడు. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్నీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హైపర్ అది. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే టాక్ షోలో పాల్గొన్న హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘సినిమా రంగం లో ఉంటూ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు.
చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను చెప్తుంది ఇప్పటి గురించి కాదు. నా కాలేజ్ డేస్ నుంచే నేను అది ఎదుర్కొన్నాను. చదువుకునే రోజుల్లో నుంచే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన గురించి ఎక్కడబడితే అక్కడ మాట్లాడేవాన్ని. ఆయనకు సపోర్ట్ గా మాట్లాడటం కొంతమందికి నచ్చేది కాదు. ఒకేసారి, పది సీనియర్లు నన్ను బెదిరించారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పైనుంచి తోసేస్తాం అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతి హైపర్ అది చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.