వర్మ ఇంట్రస్టింగ్ ట్విట్ : భీమవరంలో పవన్‌పై పోటీ చేస్తా

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 05:17 AM IST
వర్మ ఇంట్రస్టింగ్ ట్విట్  : భీమవరంలో పవన్‌పై పోటీ చేస్తా

Updated On : March 28, 2019 / 5:17 AM IST

ఎప్పుడూ వివాదాలో ఉండే దర్శకులు ఎవరంటే ఠక్కున వర్మ అని చెప్పేస్తారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు మెట్లు ఎక్కిన ఈ సినిమా రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగానే.. మరో బాంబు పేల్చారు వర్మ. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం అంటూ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

మార్చి 27వ తేదీ అర్ధరాత్రి వర్మ ట్వీట్లు చేశారు. భీమవరంలో పవన్‌పై పోటీ చేస్తా..త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ వెల్లడించారు. ఆల్ రెడీ నామినేషన్ల గడువు ముగిసిపోయింది. మరి ఆయన ఎలా కంటెస్ట్ చేస్తారు? అనే ప్రశ్న అందరిలో మెదిలింది. ఈ సందేహాలపై కూడా వర్మ మరో ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ల గడువు ముగిసిందని తెలుసు. నాకు పైనుంచి స్పెషల్ పర్మీషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేయబోతున్నాను. పూర్తి వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ వర్మ ట్వీట్ చేశారు.