Sarayu Roy: నేను వర్జిన్ కాదు.. ఏడేళ్ల సహజీవనం.. సరయు బోల్డ్ కామెంట్స్!
బోల్డ్ అంటే సరయు.. సరయు అంటే బోల్డ్.. ఆడవారి నోటి నుండి బూతులు వినిపిస్తే పాపంగా భావించే మన సమాజంలో నోరు తెరిస్తే పచ్చి బూతులు ప్రవాహంగా వినిపించే సరయు గురించి ఇంతకన్నా..
- Naresh Mannam
- Published On : September 28, 2021 / 08:30 AM IST
Sarayu Roy
Sarayu Roy: బోల్డ్ అంటే సరయు.. సరయు అంటే బోల్డ్.. ఆడవారి నోటి నుండి బూతులు వినిపిస్తే పాపంగా భావించే మన సమాజంలో నోరు తెరిస్తే పచ్చి బూతులు ప్రవాహంగా వినిపించే సరయు గురించి ఇంతకన్నా చెప్పాల్సిన పనిలేదు. పాజిటివిటీ.. నెగటివిటీ రెండూ కలిసిన సరయు ఈ మధ్యనే బిగ్ బాస్ 5 సీజన్ లో ఎంట్రీ ఇవ్వడం.. తొలి వారమే ఎలిమినేషన్.. సహజంగానే ఫైర్ బ్రాండ్.. ఆపైన తొలివారమే ఎలిమినేషన్ తో మిగతా కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి పేరు పేరునా ఇచ్చేసిన సరయు.. హౌస్ నుండి బయటకి వచ్చాక ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేస్తుంది.
Big Boss 5: ఎలిమినేషన్ గండం.. నాలుగో వారంలో ఎనిమిది మంది
అలా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరింత బోల్డ్ గా ఊహించని విధంగా తన గురించి కొత్తగా వ్యక్తిగత అంశాలను కూడా షేర్ చేసుకుంది. ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్న సరయు.. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను పక్కన పెట్టి అతడికి 100 పర్సెంట్ ఇచ్చేశానని.. నేను వర్జిన్ కూడా కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. మేము పెళ్లి చేసుకుందామనుకున్నా కుదరలేదని, కట్నం దగ్గర గొడవ కారణంగానే పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లిని తానే అవసరం లేదని రద్దు చేసుకున్నామని చెప్పుకొచ్చింది సరయు.
Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!
తాము రిలేషన్ లో ఉన్నప్పుడు సరయుతో పాటు అబ్బాయి ఇంట్లో కూడా అందరికీ తెలుసనీ.. అందరినీ ఒప్పించే పెళ్లి వరకు వెళ్లామని.. అయితే, అబ్బాయి తల్లిదండ్రులు ముందు రూ.25 లక్షలు, తర్వాత రూ50 లక్షలు.. కోటి.. ఆ తర్వాత సగం ఆస్తి అడిగారని చెప్పింది. పెళ్ళికి ముందే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక పరిస్థితి ఊహించుకొనే తనతో సెట్ కాదని వద్దనుకున్నానని చెప్పింది. రిలేషన్ షిప్ ఒక్కటే కాదు.. తప్పు చేసినా.. ఒప్పు చేసినా.. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయనని.. ముందు ఫ్యామిలీతో ఓపెన్ గా ఉండడమే తనకి ఇష్టమని చెప్పింది సరయు. సరయు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
