నేతల ఆశలపై నీళ్లు : పోటీ లేదు.. ప్రచారం లేదు : సల్మాన్

సినీ తారల కోసం ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి. తమ పార్టీ నుండి ప్రచారం చేయరూ ప్లీజ్..అంటూ ప్రముఖ హీరో, హీరోయిన్లను కోరుతుంటారు.

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 11:50 AM IST
నేతల ఆశలపై నీళ్లు : పోటీ లేదు.. ప్రచారం లేదు : సల్మాన్

Updated On : March 21, 2019 / 11:50 AM IST

సినీ తారల కోసం ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి. తమ పార్టీ నుండి ప్రచారం చేయరూ ప్లీజ్..అంటూ ప్రముఖ హీరో, హీరోయిన్లను కోరుతుంటారు.

సినీ తారల కోసం ఎన్నో పార్టీలు ఎదురు చూస్తుంటాయి. తమ పార్టీ నుండి ప్రచారం చేయరూ ప్లీజ్..అంటూ ప్రముఖ హీరో, హీరోయిన్లను కోరుతుంటారు. కొంతమంది ఒకే చెబుతూ ప్రచారం నిర్వహించడమే కాకుండా ఏకంగా ఎన్నికల బరిలో కూడా నిలుస్తుంటారు స్టార్స్. బాలీవుడ్ కండలవీరుడి విషయంలో కూడా కొన్ని రోజులుగా ఓ విషయం ప్రచారం జరుగుతోంది. ఆయన ఎన్నికల బరిలో నిలుస్తున్నాడని..ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. 
Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్

సల్మాన్ ఖాన్ని ప్రచారంలోకి దింపాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అక్కడి నేత పంకజ్ చుతర్వేదీ కూడా చెప్పారు. సల్మాన్ ప్రచారం చేస్తాడనే విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై సల్మాన్ నీళ్లు చల్లేశాడు. మార్చి 21వ తేదీ గురువారం ట్విట్టర్ వేదికగా సల్మాన్ స్పందించారు. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఏ పార్టీ తరఫునా ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశాడు. మరోవైపు ఓటింగ్ శాతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్‌పై ఈ కండల వీరుడు రెస్పాన్స్ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని…అర్హత ఉన్న ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సల్మాన్ ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. 

Contrary to the rumours I am not contesting elections nor campaigning for any political party..

— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019

We are a democracy and it is every Indian’s right to vote. I urge every eligible Indian to exercise your right and participate in making the Government. https://t.co/WsTdJ3w84O

— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019

Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ