I Bomma
I Bomma : సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ అనే వెబ్ సైట్ లో పెట్టి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి. చేసేదే తప్పు పని అయితే దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఇంకేముంది పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు. దీంతో ఐ బొమ్మ సైట్ క్లోజ్ చేసాము అని ఆ సైట్ లో ఓ మెసేజ్ కూడా వచ్చింది.(I Bomma)
ఈ సంఘటనతో ఫ్రీగా ఐ బొమ్మలో సినిమాలు చూసేవాళ్ళు బాధపడుతున్నారు. అయితే ఐ బొమ్మ క్లోజ్ అయిన మూడు రోజులకే ఐ బొమ్మ వన్ అనే వెబ్ సైట్ ప్రత్యక్షమైంది. దాంట్లో సినిమాలేమి లేవు. కానీ ‘iBOMMA one’ సైట్ లోకి వెళ్తే అది మరో పైరసీ సైట్ మూవీ రూల్స్ కి వెళ్తుంది. దీంతో మూవీ రూల్స్ వాళ్ళు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఈ ఐ బొమ్మ పేరు వాడుకొని వాళ్లకు ట్రాఫిక్ పెంచుకోడానికి డూప్లికేట్ సైట్ క్రియేట్ చేసారని భావిస్తున్నారు.
Also Read : Divvela Madhuri : దువ్వాడ – దివ్వెల భలే ఛాన్స్ కొట్టేసారుగా.. ఆ హీరో సినిమాలో నటించిన జంట.. రేపే రిలీజ్..
పలువురు రవి టీమ్ ఎవరైనా ఈ ఐ బొమ్మ వన్ సైట్ క్రియేట్ చేసి ఉంటారని, మళ్ళీ ఐ బొమ్మ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఐ బొమ్మ ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్ సైట్స్ ఉన్నాయని, అందులో భాగంగానే ఈ సైట్ ని బయటకు తెచ్చారని భావిస్తున్నారు. ఇలాంటి మిగతా సైట్స్ మీద కూడా ఫోకస్ చేసే ప్లాన్స్ లో ఉన్నపోలీసులు.
అయితే ఐ బొమ్మ పైరసీ మూవీస్ కేవలం ఒక సైడ్ బిజినెస్ అని, అసలు బిజినెస్ ఇందులోకి వచ్చేవాళ్లు డేటా తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఈ సైట్ లోకి వచ్చేవాళ్లను బెట్టింగ్ సైట్స్ లోకి మళ్లించడం, దాని ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని పోలీసులు తెలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చే సైట్స్ కూడా బెట్టింగ్ యాప్స్ లేదా, హానికరమైన లింక్స్ తో ఉంటాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా సినిమాలు చూడొచ్చు అని ఏది పడితే అది క్లిక్ చేస్తే అంతే సంగతులు అని అంటున్నారు పోలీసులు.
Also Read : I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..