I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..

పలువురు ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ బొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు.(I Bomma Ravi)

I Bomma Ravi : ఓర్నీ.. ఐ బొమ్మ రవి పై బయోపిక్.. ఇదెక్కడి ప్లాన్..

I Bomma Ravi

Updated On : November 20, 2025 / 8:29 AM IST

I Bomma Ravi : ఐ బొమ్మ సైట్ తో పైరసీ సినిమాలు చూపించి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ చేసాడు. దీంతో పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసారు. అయితే పలువురు ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ బొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు.

అయితే ఐ బొమ్మ రవి పై బయోపిక్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఎవరివి పడితే వాళ్ళవి బయోపిక్స్ చేస్తున్నారు. ఒకప్పుడు గొప్పగొప్ప వాళ్ళవి బయోపిక్స్ చేస్తే ఇపుడు మోసగాళ్లు, బ్యాంకులను కొల్లగొట్టే వాళ్ళను, స్మగ్లింగ్ చేసేవాళ్లను.. ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులను కూడా సినిమా మెటీరియల్స్ గా మారి, హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు.

Also Read : Surekha Vani Supritha : కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. దగ్గరుండి మరీ డబ్బింగ్ చూసుకుంటున్న తల్లి..

ఇప్పుడు ఐ బొమ్మ రవిపై కూడా సినిమా చేస్తారట. తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థలో యూట్యూబర్ ఫేమ్ దొరసాయి తేజ ఈ సినిమా బయోపిక్ తీస్తాడని సమాచారం. ఐ బొమ్మ ఇమ్మడి రవి లైఫ్, అతని ఫ్యామిలీ ఆటుపోట్లు, ఐ బొమ్మని ఎలా మొదలుపెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్.. ఇలాంటి అంశాలతో ఐ బొమ్మ రవి బయోపిక్ ని సినిమాగా తెరకెక్కిస్తారట.

అయితే కొంతమంది జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని. మరి ఫ్రీగా సినిమాలు చూపించే వాడి సినిమా థియేటర్లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకొని వస్తారు, అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు కదా, అప్పుడు సినిమాకి నష్టమే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Director Saailu : సినిమా హిట్ అవ్వకపోతే కట్ డ్రాయర్ మీద పరిగెడతా.. డైరెక్టర్ ఛాలెంజ్..