Zarina Wahab : షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. వచ్చే జన్మలో నా కొడుకుగా పుట్టాలి.. డార్లింగ్ పై సీనియర్ నటి ప్రశంసలు..

సలార్, కల్కి సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ అందుకున్న రెబల్ స్టార్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నారు.

Zarina Wahab : షూటింగ్ అయిపోయినా సెట్ లోనే.. వచ్చే జన్మలో నా కొడుకుగా పుట్టాలి.. డార్లింగ్ పై సీనియర్ నటి ప్రశంసలు..

I want Prabhas as my son Senior actress Zarina Wahab interesting comments on rebel star

Updated On : November 28, 2024 / 3:01 PM IST

Zarina Wahab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సలార్, కల్కి సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ అందుకున్న రెబల్ స్టార్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ఓ చిన్న పోస్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. చిన్న వీడియోతోనే ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు.

అయితే తాజాగా సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు. అలాగే ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే జన్మ అంటూ ఉంటే ప్రభాస్ నా కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. “నేను ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా ఏప్రిల్ లో వస్తుంది. ఇందులో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ లాంటి మంచి మనిషిని నేను ఇంత వరకు చూడలేదు. వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి. ఒకటి ప్రభాస్, మరొకరు సూరజ్. ప్రభాస్ చాలా లవ్లీ పర్సన్. ఆ మనిషిలో అసలు ఈగో అనేదే ఉండదు. నా ఒక్క దానితోనే కాదు. సెట్ లో అందరితో అలానే ఉంటారని తెలిపింది.

Also Read : Srikakulam Sherlockholmes Teaser : ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ టీజర్.. వెన్నెల కిషోర్ అదరగొట్టాడుగా..

అంతేకాకుండా… సెట్ కి వచ్చి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఇలా అందరి దగ్గరికి వచ్చి మరీ వెళ్ళేటప్పుడు బాయ్ అని చెప్తాడు. అతనికి అంత అవసరం ఏముంది. అయినా కూడా అందరిని కలుస్తాడు. ఒకవేళ నెక్స్ట్ రోజు అతని సీన్స్ లేకపోతే షూటింగ్ నుండి వెళ్ళిపోడు. ఒక పక్కన కూర్చొని షూటింగ్ చూస్తుంటాడు. అంతేకాదు ఎవరికైనా ఆకలి వేస్తుంది అంటే.. సెట్ లో ఉన్న వారందరికీ భోజనం తెప్పిస్తారు. స్వయంగా తన ఇంటికి కాల్ చేసి మరీ అందరికి భోజనం చేయిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ చెప్పుకొచ్చింది జరీనా వహాబ్.