Srikakulam Sherlockholmes Teaser : ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ మూవీ టీజర్.. వెన్నెల కిషోర్ అదరగొట్టాడుగా..
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.

Vennela Kishore Ananya Nagalla Srikakulam Sherlockholmes movie Teaser
Srikakulam Sherlockholmes Teaser : వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఇక ఈ సినిమా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రైటర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ కనబరిచాయి. డిసెంబరు 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.
అయితే తాజాగా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లో వెన్నల కిషోర్ యాక్టింగ్, టైమింగ్ అదిరిపోయాయి. టీజర్ చూస్తుంటే ఈ సినిమా మొత్తం శ్రీకాకుళం యాసలోనే ఉంది. వెన్నెల కిషోర్ ఈ యాసను అచ్చం దింపేసాడు. పోలీసులకు కూడా అంతుచిక్కని కొన్ని విషయాలను వెన్నెల కిషోర్ తనదైన ఇన్వెస్టిగేషన్ చేసి ఛేదిస్తాడు. ఇదంతా ఎలా జరుగుతుంది అన్నది తెలియాలంటే సినిమా చుడాల్సిందే.
Also Read : Nagarjuna Akkineni : ఒకేసారి అక్కినేని బ్రదర్స్ వివాహం.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున..
ఇక ఇప్పటికే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టీజర్ చూస్తుంటే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించేలా కనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాలో తన కామెడీతో ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా టీజర్ మీరు కూడా ఓసారి చూసేయండి..