Ramesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్!
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేశ్ బాబు సోదరుడు నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో..
- Naresh Mannam
- Published On : January 9, 2022 / 02:34 PM IST
Ramesh Babu (2)
Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేశ్ బాబు సోదరుడు నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్ బాబు ఆరోగ్యపరిస్థితి విషమించడంతో శనివారం కుటుంబ సభ్యులు ఆయనను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.
Ramesh Babu : ముగిసిన ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు
ఆదివారం ఉదయం నుంచి రమేశ్ బాబు భౌతిక కాయాన్ని సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచగా.. కరోనా దృష్ట్యా కేవలం కుటుంబ సభ్యులకి, సినీ ప్రముఖులకు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు రమేశ్ బాబుకి నివాళులు అర్పించగా.. మహేశ్ బాబుకి మాత్రం అన్న చివరి చూపు కూడా దక్కలేదు. కరోనా సోకడంతో మహేశ్ బాబు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండడంతో రమేశ్ భౌతిక కాయాన్ని కడచూపుకు కూడా నోచుకోలేదు.
Nagarjuna : ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో 6గురు.. ‘బంగార్రాజు’ సినిమాలో 8మంది హీరోయిన్స్
కాగా, రమేష్ బాబు మృతిపై సోదరుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం.. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు.. మీరు నా కోసం చేసిన ప్రతీ దానికి ధన్యవాదాలు.. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అంటూ మహేష్ బాబు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
