Ilaiyaraaja presents a crown worth Rs. 4 crore to Kollur Mookambika
Ilayaraja: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కర్ణాటక ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆమ్మవారికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని బహూకరించారు. అలాగే, వీరభద్ర స్వామికి వెండి కత్తిని అందించారు. అనంతరం పూజలో అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఇళయరాజాకు తీర్థ ప్రసాదాలతోపాటు అమ్మవారి ఫొటో అందజేశారు అర్చకులు. ఇక ఈ కార్యక్రమంలో ఇళయరాజా(Ilayaraja)తో పాటు ఆయన కుమారుడు కార్తిక్, మనవడు యతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Kantara Chapter 1: కేరళలో కాంతార 1 విడుదలపై నిషేధం.. కారణం ఏంటంటే?
ఈ సందర్బంగా ఇళయరాజా మాట్లాడుతూ “ఆ జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సులే వల్లే నా జీవితంలో ప్రతిదీ సాధ్యమైంది. నేను చేసింది ఏమీలేదని” చెప్పుకొచ్చాడు ఇళయరాజా. ఇక ఇళయరాజా సాధారణ భక్తుడిగానే ఈ ఆలయానికి వస్తుంటారని, గతంలోనూ ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహూకరించారని” మూకాంబిక ఆలయం మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ బాబు శెట్టి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇళయరాజా అమ్మవారికి సమర్పించుకున్న కిరీటం, కత్తికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.