Venkat Prabhu : నాగచైతన్య(Nag Chaitanya), కృతి శెట్టి(Krithi Shetty) జంటగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కస్టడీ(Custody). ఇందులో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు. కస్టడీ సినిమా మే 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇటీవలే మానాడు సినిమాతో మంచి విజయం సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కస్టడీతో కూడా విజయం సాధించి చైతూకి పెద్ద హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇక కస్టడీ సినిమా కోసం మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, అతని తనయుడు యువన్ శంకర్ రాజా ఇద్దరూ కలిసి మ్యూజిక్ ఇవ్వడం విశేషం. తండ్రి కొడుకులిద్దరూ కలిసి గతంలో ఓ తమిళ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో కస్టడీనే మొదటి సినిమా. ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ కి ఇళయరాజా మ్యూజిక్ ఇవ్వగా, ఒక సాంగ్, పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యువన్ శంకర్ రాజా ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై సంగీతాభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు ఎందుకు ఇద్దర్ని తీసుకున్నారో తెలిపాడు. వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎందుకు తీసుకున్నామో సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది. నేను సంగీత కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడ ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుందో నాకు అవగాహన ఉంది. అందుకే ఇద్దర్ని తీసుకున్నాను. సినిమాలో ఇద్దరూ తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు. సినిమా ఇళయరాజా సంగీతంతోనే మొదలవుతుంది. యాక్షన్ మొదలయ్యాక యువన్ శంకర్ రాజా వినిపిస్తాడు అని అన్నారు. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ లో లో పవర్ ఫుల్ BGM, సాంగ్స్ లో మ్యూజిక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.