దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన జులాయి,దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో కన్పించిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చింది. 5ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో రవితేజ సరసన నటించింది.
పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఈ సుందరి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. బ్లూ రొమాంటిక్ సప్పీ పాటలు వింటూ, మ్యూజిక్ వీడియోలో నన్ను ఊహించుకుంటూ కిటికీ నుండి తెలివిగా చూస్తున్నాను అనే కాప్షన్ తో ఆ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఫుల్ రెస్ఫాన్స్ వస్తోంది. షేర్ చేసిన ఫొటోలో బ్లూ కలర్ బికినీలో ఆమె ఒక గాజు కిటికీ వైపు వాలుతూ ఉన్నట్లుగా ఉంది.
ఈ ఫొటోను చూసిన నెటిజన్లు..ఇలియానా చాలా అందంగా ఉందని,ఎవర్ గ్రీన్ బ్యూటీ అని,గార్జియస్ అంటూ,లుకింగ్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇల్లీ బేబీ..అన్నీస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న పాగల్ పంటి సినిమాలో అనీల్ కపూర్,జాన్ అబ్రహం సరసన నటిస్తోంది. నవంబర్-22,2019న ఈ సినిమా రిలీజ్ కానుంది. అభిషేక్ బచ్చన్ సరసన ఇలియానా నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.