Ileana D’Cruz : భర్త గురించి మొదటిసారి మాట్లాడిన ఇలియానా.. బాబు పుట్టాక..

ఇలియానా భర్త విషయంలో మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఓ ఫోటో ఒకటి షేర్ చేసింది. కానీ అతని గురించి వివరాలు ఏమి చెప్పలేదు.

Ileana D'Cruz spoke about her Partner Michael Dolan in Bollywood Interview

Ileana D’Cruz : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా సినిమాలకు దూరమై అడపాదడపా సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంది. కొన్నాళ్ల క్రితం పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి పండంటి మగబిడ్డకి జన్మనించ్చింది. ఇక తన బాబు ఫోటో కూడా షేర్ చేస్తూ అప్పుడప్పుడు తన బాబుతో ఉన్న లైఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తన బాబు పేరు ఫీనిక్స్ డోలన్ అని పెట్టినట్టు కూడా తెలిపింది.

అయితే ఇలియానా భర్త విషయంలో మాత్రం సీక్రెట్ గానే ఉంటుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం తన భర్తతో ఉన్న ఓ ఫోటో ఒకటి షేర్ చేసింది. కానీ అతని గురించి వివరాలు ఏమి చెప్పలేదు. మొదటిసారి ఇలియానా తన భర్త గురించి మాట్లాడింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా తన ప్రగ్నెన్సీ, సినిమాలు, తన భర్త గురించి మాట్లాడింది.

ఇలియానా మాట్లాడుతూ.. నేను బిడ్డ పుట్టాక చాలా డిప్రెషన్ కి గురయ్యాను. చాలా ఏడ్చాను. నా బాబు వేరే గదిలో పడుకుంటే డాక్టర్లు బాగా చూసుకున్నారు. నేను ఇంకో గదిలో ఉండి ఏడ్చాను. ఆ సమయంలో నాకు మైఖేల్ డోలన్(ఇలియానా భర్త) తోడుగా నిలబడ్డాడు. నన్ను రెస్ట్ తీసుకొమ్మని చెప్పి బాబుని తనే చూసుకున్నాడు. ఇంత మంచివాడు నాకు తోడుగా రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు అని చెప్పుకొచ్చింది.

Also Read : Eagle : సంక్రాంతి నుంచి ‘ఈగల్’ అఫీషియల్‌గా అవుట్.. రిలీజ్ అప్పుడే.. టిల్లు 2, యాత్ర 2 కూడా వాయిదా..

అయితే ఇలియానా భర్త మైఖేల్ డోలన్ అని చెప్పి, అతను తనని ఎంత బాగా చూసుకుంటాడో చెప్పింది కానీ మళ్ళీ అతని గురించి పూర్తిగా వివరాలు చెప్పలేదు. అతని విషయంలో మాత్రం ఇలియానా ప్రైవసీ మెయింటైన్ చేస్తూనే వస్తుంది.