Eagle : సంక్రాంతి నుంచి ‘ఈగల్’ అఫీషియల్‌గా అవుట్.. రిలీజ్ అప్పుడే.. టిల్లు 2, యాత్ర 2 కూడా వాయిదా..
సంక్రాంతి నుంచి 'ఈగల్' అఫీషియల్‌గా తప్పుకుంది. కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న టిల్లు 2, యాత్ర 2..

sankranti movie and tillu square yatra 2 release dates details
Eagle : మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఈగల్’ పోస్టుపోన్ అయ్యిందంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. అఫీషియల్ గా వాయిదా వార్తని తెలియజేశారు. ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జ సినిమాల రిలీజ్ లు కూడా ఉన్నాయి.
ఈ చిత్రాలు అన్ని రెండు రోజులు వ్యవధిలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో పలు సినిమాలకు స్క్రీన్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఎవరో ఒకరి తప్పుకుంటే అందరికి మంచిదని.. ఇటీవల దిల్ రాజు ఆయా సినిమాల నిర్మాతలతో 15 రోజుల క్రితం ఓ సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా నేడు ఈ విషయం ఓ క్లారిటీ వచ్చేసింది. అన్ని సినిమాల మంచి కోసం అలోచించి రవితేజ, ఈగల్ చిత్ర నిర్మాతలు.. తమ సినిమాని వెనక్కి తీసుకు వెళ్తున్నట్లు ప్రకటించారు.
Also read : Vaishnavi Chaitanya : టాలీవుడ్ ‘బేబీ’ వైష్ణవి బర్త్‌డే.. మరో సినిమా అనౌన్స్.. టోటల్ లైనప్ అదుర్స్..
ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వెనక్కి తగ్గిన సినిమాకి సోలో డేట్ ఇస్తామంటూ నిర్మాతల కౌన్సిల్ ప్రకటించింది. ఈక్రమంలోనే ఆల్రెడీ ఫిబ్రవరి 9న రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలను పోస్టుపోన్ చేయించేలా నిర్మాత మండలి భాద్యత తీసుకుంది. ఆ రోజున డీజే టిల్లు 2, యాత్ర 2 రిలీజ్ లు ఉన్నాయి. డీజే టిల్లు 2 నిర్మిస్తున్న నాగవంశీ ఈ సంక్రాంతి రేసులో గుంటూరు కారంతో ఉండడంతో.. టిల్లు 2ని వాయిదా వేయడానికి వెంటనే ఒప్పుకున్నట్లు నిర్మాత మండలి తెలియజేసింది.
కాగా డీజే టిల్లు 2 ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి పోస్టుపోన్ అయ్యింది. ఇక అదే డేట్ లో ఉన్న యాత్ర 2 నిర్మాత వంశి.. ఇంకా అందుబాటులోకి రాలేదని, వారితో కూడా మాట్లాడి ఆ చిత్రాన్ని కూడా వాయిదా వేయాలని కోరుతాము అంటూ దిల్ రాజు తెలియజేశారు. అలాగే రవితేజ పోస్టుపోన్ వేసుకున్నది అందరి మంచి కోసం. దీనిని వేరే విధంగా మాట్లాడొద్దని కోరారు.