Vaishnavi Chaitanya : టాలీవుడ్ ‘బేబీ’ వైష్ణవి బర్త్‌డే.. మరో సినిమా అనౌన్స్.. టోటల్ లైనప్ అదుర్స్..

టాలీవుడ్ 'బేబీ' వైష్ణవి చైతన్య స్టార్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె టోటల్ లైనప్ అదుర్స్.

Vaishnavi Chaitanya : టాలీవుడ్ ‘బేబీ’ వైష్ణవి బర్త్‌డే.. మరో సినిమా అనౌన్స్.. టోటల్ లైనప్ అదుర్స్..

Tollywood Heroine Vaishnavi Chaitanya cinema lineup details

Updated On : January 4, 2024 / 8:11 PM IST

Vaishnavi Chaitanya : తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. రీసెంట్ ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఛాలెంజింగ్ పాత్రని ఎంచుకోవడం కాదు, ఆ సినిమాని తానే ముందుండి నడిపించి 90 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని బిగెస్ట్ బ్లాక్ బస్టర్ ని చూశారు. ప్రస్తుతం వైష్ణవి తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ గా మారిపోతున్నారు. అవి కూడా స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం గమనార్హం.

నేడు జనవరి 4న వైష్ణవి చైతన్య పుట్టినరోజు కావడంతో ఆమె కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేశారు. నేడు వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో వైష్ణవి ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు.

వైష్ణవి లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాతో పాటు వైష్ణవి లైనప్ లో ఉన్న మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో ఉండబోతుంది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. కొత్త దర్శకుడు అరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Also read : Pavala Syamala : దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలకు కాదంబ‌రి సాయం..

అలాగే బేబీ చిత్రంలో నటించి తనతో పాటు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నారు. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాతగా కూడా మారడం విశేషం. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. బేబీ సినిమా నిర్మాత SKN కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు.

ఇలా వరుసగా స్టార్ ప్రొడక్షన్ హౌస్‌ల్లో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. ఇక తెలుగు నుంచి కూడా ఒక అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకోవడం తెలుగు ఆడియన్స్ ని ఆనందపరుస్తుంది. అలాగే వైష్ణవికి పుట్టిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.