Pavala Syamala : దీనస్థితిలో ఉన్న పావలా శ్యామలకు కాదంబరి సాయం..
దీనస్థితిలో ఉన్న పావలా శ్యామల పరిస్థితిని ఓ మీడియా ద్వారా తెలుసుకున్న కాదంబరి కిరణ్ ఆమెను వెతుకుంటూ వెళ్లి..

Kadambari Kiran help for tollywood senior actress Pavala Syamala
Pavala Syamala : తెలుగు నటి పావలా శ్యామల, ఒకప్పుడు కమెడియన్ గా చేతినిండా సినిమాలతో బిజీ లైఫ్ చూసి ప్రస్తుతం వయసు సహకరించకపోవడంతో సినిమాల్లో కనిపించడం లేదు. అంతేకాకుండా తన కూతురితో పాటు ఆమె కూడా అనారోగ్యం పాలయ్యి ప్రస్తుతం వృద్ధాశ్రమంలో దీనస్థితిలో ఉన్నారు. ఇక ఆమె పరిస్థితిని ఓ మీడియా ద్వారా తెలుసుకున్న తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ఆమెకు సహాయం అందించారు.
Also read : Janhvi Kapoor : జాన్వీని శ్రీదేవి ఏమని తిట్టేదో తెలుసా..? బాబోయ్ అదికూడా తెలుగు బూతు..
‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తూ వస్తున్న కాదంబరి కిరణ్.. పావలా శ్యామల పరిస్థితిని ఓ మీడియా ద్వారా తెలుసుకొని ఆమెను వెతుకుంటూ వెళ్లి సహాయం అందించారు. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న శ్యామలను కలుసుకొని ఆమె రూ.25,000 నగదు సాయాన్ని చెక్ రూపంలో ఆమెకు అందించారు. ఆమెకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలు తీర్చేలా సహాయం చేశారు.
ఇక శ్యామల పరిస్థితిని తెలుసుకొని, ఆమెను వెతుకుంటూ వెళ్లి మరి సహాయం చేసిన కాదంబరి కిరణ్ ని నెటిజెన్స్ అభినందిస్తున్నారు. కాగా కాదంబరి కిరణ్ ‘మనం సైతం’ ఫౌండేషన్ గత దశాబ్దం కాలం నుంచి సేవలు అందిస్తూ వస్తున్నారు. కష్టంలో ఉన్న సినీ పేద కార్మికులకు, పేదలకు ఆయన సహాయం అందిస్తూ వస్తున్నారు.