నెటిజన్ అసభ్యకర కామెంట్..వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి సమాధానం

  • Published By: venkaiahnaidu ,Published On : June 4, 2020 / 11:40 AM IST
నెటిజన్ అసభ్యకర కామెంట్..వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి సమాధానం

Updated On : June 4, 2020 / 11:40 AM IST

 ఒకప్పటి ప్రపంచ సుందరి సుస్మిత సేన్ మరదలు, టీవీ నటి చారు అసోపా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఓ నెటిజన్ కామెంట్ కు ఆమె స్పందించిన తీరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ను సేన్‌ను గతేడాది వివాహం చేసుకున్న చారు అసోపా… ఇటీవల లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్నకారణంగా తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారు.

ఈ క్రమంలో తాను ఎంతగానో ఇష్టపడే రెడ్‌ కలర్‌ క్రాప్‌ జాకెట్‌ ధరించి ఇంట్లో ఫోటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక ఈ డ్రెస్‌తో బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేసి దానిని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆమె ఫోటోలకు,వీడియోకు చాలామంది అభిమానులు కామెంట్లతో ప్రశంసించారు. చారు రెడ్‌ దుస్తుల్లో అదిరిపోయారంటూ అభిమానులు పొగుడుతూంటే మరికొంతమంది ఆమె డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌ చేస్తున్నారు.

వేషాధారణ సరిగా లేదని ఇలాంటి దుస్తులు ధరించడానికి సిగ్గు లేదా అని దారుణంగా చారుపై ట్రోల్ చేస్తూ హంగామా చేశారు. శోభ అనే నెటిజన్‌…నీ అందాలు చూపించాలంటే.. చూపించి.. చూపించినట్టు ఎందుకు.. మొత్తం చూపించవచ్చు కదా. మాకు మొత్తం కనిపిస్తాయిగా అని నెటిజన్ కామెంట్ పెట్టింది. అంటూ అసభ్యకర కామెంట్‌ చేసింది.

అయితే ఈ కామెంట్లపై చారు ఘాటుగా స్పందించింది. నా శరీరం బాగుంది కాబట్టి నేను దానిని చూపించాలనుకుంటాను. ఒకవేళ మీకు కూడా ఉంటే మీరు కూడా చూపించవచ్చంటూ విమర్శలను తిప్పికొట్టారు. చూసే కళ్లను బట్టే ఎదుటివారిపై అభిప్రాయం మారుతుందన్నారు. మహాదేవ్‌, దియా ఔర్‌ బాతి హమ్‌, మేరే ఆంగ్నే మెయిన్‌, మహారక్షక్‌ వంటి టీవీ షోలలో నటించి మంచి పేరును సంపాదించారు. పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Pehli baarish ki Khushi❤️ ❤️❤️ @fomo_thelabel #fomo

A post shared by Charu Asopa Sen (@asopacharu) on