IMDB : 2023 పాపులర్ స్టార్స్ అంటూ IMDB లిస్ట్.. సౌత్ స్టార్ హీరోలు ఎవ్వరూ లేకపోవడంతో అభిమానులు ఫైర్..

MDB సంస్థ ఇచ్చిన ర్యాంక్స్ వివాదం అవుతుంది. సౌత్ ఆడియన్స్, సౌత్ హీరోల అభిమానులు IMDB పై విమర్శలు చేస్తున్నారు.

IMDB Most Popular Indian Stars 2023 list goes viral and makes Controversy

IMDB Stars : ప్రముఖ సినిమా డేటాబేస్ సంస్థ IMDBకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు, షోల గురించి, అందులో నటీనటుల గురించి ఇన్ఫర్మేషన్స్, వాటికి సంబంధించిన రేటింగ్స్ IMDB సంస్థ ఇస్తూ ఉంటుంది. అలాగే IMDB ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ వైజ్, ఓవరాల్ గా టాప్ 10 స్టార్స్ అంటూ అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది.

తాజాగా IMDB సంస్థ 2023లో మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ వీళ్ళే అంటూ ఓ పదిమందిని ప్రకటించింది. అందులో నెంబర్ 1 పొజిషన్ లో షారుఖ్ ఖాన్ ఉండగా ఆ తర్వాత వరుసగా.. అలియా భట్, దీపికా పదుకొనే, వామిక గబ్బి, నయనతార, తమన్నా, కరీనా కపూర్, శోభిత ధూళిపాళ, అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి ఉన్నారు. అయితే ఈ ర్యాంక్స్ IMDB సైట్ లో ఆ స్టార్స్ ఈ సంవత్సరం చేసిన సినిమాల్లోని పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ఆధారంగా ఇచ్చినట్టు ప్రకటించారు.

Also Read : Amardeep : అమర్‌దీప్‌‌కి ఆ ఆరోగ్య సమస్య ఉందా? అందుకే బిగ్‌బాస్‌లో అలా.. అమర్ సీక్రెట్స్ చెప్పిన స్నేహితుడు..

అయితే ఇపుడు IMDB సంస్థ ఇచ్చిన ర్యాంక్స్ వివాదం అవుతుంది. సౌత్ ఆడియన్స్, సౌత్ హీరోల అభిమానులు IMDB పై విమర్శలు చేస్తున్నారు. అసలు నయనతార తప్ప ఎవరూ సౌత్ యాక్టర్స్ లేకపోవడం, ఈ సంవత్సరం మంచి సినిమాలే ఇచ్చిన విజయ్, అజిత్, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్.. లాంటి యాక్టర్స్ లేకపోవడం, తెలుగులో కూడా ఎవ్వరు లేకపోవడం, సినిమాలు కూడా అన్ని బాలీవుడ్ సినిమాలే లెక్కలోకి తీసుకోవడం, నయనతార, విజయ్ సేతుపతికి ఇచ్చినా బాలీవుడ్ సినిమా ఆధారంగానే ఇవ్వడం.. ఇలా సౌత్ స్టార్స్ ని పట్టించుకోకుండా కేవలం బాలీవుడ్ కి మాత్రమే ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు ఉందని, ఇది పాపులర్ లిస్ట్ ఇన్ బాలీవుడ్ అని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. IMDB పోస్ట్ కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏ లెక్కల్లో ఈ ర్యాంక్స్ ఇచ్చావు అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి IMDB సంస్థ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారయింది.

ట్రెండింగ్ వార్తలు