Amardeep : అమర్‌దీప్‌‌కి ఆ ఆరోగ్య సమస్య ఉందా? అందుకే బిగ్‌బాస్‌లో అలా.. అమర్ సీక్రెట్స్ చెప్పిన స్నేహితుడు..

తాజాగా అమర్‌దీప్‌‌ స్నేహితుడు, సీరియల్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమర్‌దీప్‌‌ కి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు.

Amardeep : అమర్‌దీప్‌‌కి ఆ ఆరోగ్య సమస్య ఉందా? అందుకే బిగ్‌బాస్‌లో అలా.. అమర్ సీక్రెట్స్ చెప్పిన స్నేహితుడు..

Amardeep effected with some Health Issues in Bigg Boss

Updated On : November 24, 2023 / 4:32 PM IST

Amardeep : ప్రస్తుతం బిగ్‌బాస్(Bigg Boss)లో టాప్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నది అమర్‌దీప్‌‌ కే. సీరియల్ నటుడిగా అమర్‌దీప్‌‌ హౌస్ లోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి కూడా రఫ్ అండ్ టఫ్ గా గేమ్ ఆడుతున్నాడు. అన్ని టాస్కుల్లో అందరికి గట్టి పోటీ ఇస్తున్నాడు. మాటలతో, ఫిజికల్ గా గేమ్స్ గెలవడానికి చూస్తున్నాడు. అమర్‌దీప్‌‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. టాప్ 5లోకి కూడా అమర్‌దీప్‌‌ వెళ్లొచ్చు అని వినిపిస్తుంది.

అయితే అమర్‌దీప్‌‌కి ఓ ఆరోగ్య సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. అమర్‌దీప్‌‌కి ఫిట్స్ వస్తాయని, అప్పుడప్పుడు సడెన్ గా ఫిట్స్ వచ్చి పడిపోతాడని, మానసికంగా బాగా అలసిపోయాడని, అందుకే షోలో ఒకేసారి బాగా కోపం, ఏడుపు.. ఇలా వెంటవెంటనే ఎమోషన్స్ మారుస్తాడని సమాచారం. ఇటీవల హౌస్ లో అమర్‌దీప్‌‌ ఫిట్స్ వచ్చి పడిపోతే హౌస్ లోని మెడికల్ రూమ్ లోకి తీసుకెళ్లి చికిత్స చేశారని సమాచారం. అయితే ఇది బయట టెలికాస్ట్ లో ఎక్కడ చూపించకుండా జాగ్రత్త పడ్డారట.

తాజాగా అమర్‌దీప్‌‌ స్నేహితుడు, సీరియల్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమర్‌దీప్‌‌ కి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు. నరేష్ మాట్లాడుతూ.. అతడికి ఫిట్స్ వచ్చిన వార్తలు నిజమే. అతను ఇటీవల చేసిన ఓ డ్యాన్స్ షోలో శారీరికంగా, మానసికంగా బాగా బలహీనమయ్యాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోకుండా కష్టపడ్డాడు. ఏదో సమస్యతో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాం. అతని శరీరంలో కండరాల ఎదుగుదల ఆగిపోయింది. ఇది అతని ఆరోగ్యానికి హానికరం అవ్వొచ్చు అని డాక్టర్లు చెప్పారు. అతనికి శరీరం సరిగ్గా సహకరించట్లేదు. బిగ్ బాస్ కి వెళ్లే ముందు రెండు రోజులు ఫుల్ గా పడుకున్నాడు. హౌస్ లో కూడా ఇప్పుడు మెంటల్ గా, ఫిజికల్ గా బాగా ఒత్తిడికి గురవుతున్నాడు. అయినా అమర్ ఈ విషయాలన్ని బయటకి చెప్పకుండా గేమ్ నిజాయితీగా ఆడుతున్నాడు అని తెలిపాడు.

Amardeep effected with some Health Issues in Bigg Boss

Also Read : Ranbir Kapoor : ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను.. రణబీర్ రిక్వెస్ట్..

అమర్‌దీప్‌‌ ప్రస్తుతం ఈ సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసి అతని అభిమానులు, నెటిజన్లు అయ్యో పాపం అంటున్నా.. ఆ సమస్యలు బయటకి చెప్పకుండా, సింపతీ కోసం ట్రై చేయకుండా నిజాయితీగా గేమ్ ఆడుతున్నడని అభినందిస్తున్నారు. అమర్‌దీప్‌‌ ఓ పక్క సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. పలు చిన్న సినిమాల్లో హీరోగా కూడా ఛాన్సులు వస్తున్నాయి. హౌస్ నుంచి బయటకి వచ్చాక ఈ ఛాన్సులు ఇంకా పెరగొచ్చేమో. ఇక ఇటీవలే హౌస్ లోకి వచ్చేముందు అమర్ దీప్ తేజస్విని గౌడ్ అనే మరో సీరియల్ నటిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.