Ranbir Kapoor : ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను.. రణబీర్ రిక్వెస్ట్..

సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) సినిమా కూడా ప్రకటించాడు.

Ranbir Kapoor : ప్రభాస్ అన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను.. రణబీర్ రిక్వెస్ట్..

Ranbir Kapoor Requests Sandeep Vanga for a Chance in Prabhas Spirit Movie

Ranbir Kapoor : ప్రభాస్(Prabhas) ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత సందీప్ వంగ(Sandeep Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) సినిమా కూడా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం సందీప్ వంగా ‘యానిమల్’(Animal) సినిమాతో రాబోతున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ వంగా, రణబీర్, రష్మిక.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ ఎపిసోడ్ ఇవాళ్టి నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో రణబీర్, రష్మిక, సందీప్ వంగ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక ఈ షోలో బాలకృష్ణ.. ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి కూడా అడిగారు.

దీనికి సందీప్ వంగ బదులిస్తూ.. 2024 సెప్టెంబర్‌లో ప్రభాస్ సినిమా మొదలవుతుందని చెప్పాడు. దీంతో ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే రణబీర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ అన్నతో సినిమా చేస్తున్నాడు. అందులో నాకు ఓ చిన్న పాత్ర ఇస్తే సంతోషంగా చేస్తాను అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి సందీప్ వంగ ప్రభాస్ సినిమాలో రణబీర్ కోసం ఏదైనా స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ రాస్తాడేమో చూడాలి. అదే జరిగితే స్పిరిట్ సినిమాపై బాలీవుడ్ లో కూడా మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.

Also Read : Animal : ‘యానిమల్‌’కి సీక్వెల్ ఉందా..? అన్‌స్టాపబుల్ షోలో సందీవ్ వంగా ఏం చెప్పారు..?

ప్రభాస్ అభిమానులు కూడా రణబీర్ కోసం ‘స్పిరిట్’లో ఓ రోల్ రాయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రణబీర్ ప్రభాస్ ని అన్న అని పిలవడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.