Jaya Lalitha : సీనియర్ నటి జయలలిత పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా?.. చివరికి చంపేయబోతుంటే ..

స్క్రీన్ మీద సీనియర్ నటి జయలలిత అంటే తెలియని వారుండరు. రియల్ లైఫ్‌లో తను పడ్డ కష్టాలను ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె షేర్ చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Jaya Lalitha : సీనియర్ నటి జయలలిత పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా?.. చివరికి చంపేయబోతుంటే ..

Jaya Lalitha

Updated On : September 16, 2023 / 4:46 PM IST

Jaya Lalitha : నటి జయలలిత గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం అన్ని సినిమాలు కలిపి దాదాపుగా 650 సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్‌లో కూడా పేరు సంపాదించుకున్నారు. రీల్ లైఫ్‌లో ఇంత పేరు తెచ్చుకున్న జయలలితను పెళ్లి చేసుకున్న వ్యక్తే మోసం చేసాడట. తనను చంపడానికి కూడా ప్రయత్నించడంతో అతనితో బంధాన్ని తెంచుకున్నానని ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో షేర్ చేసుకున్నారు.

Anand Devarakonda : అన్నయ్యతో కలిసి ఫ్యూచర్ లో సినిమా ఉండొచ్చేమో.. దేవరకొండ బ్రదర్స్ మల్టీ స్టారర్?

జయలలిత కమల్ హాసన్ ఇంద్రుడు, చంద్రుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మామ అల్లుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, గోపీ గోపిక గోదావరి, భరత్ అనే నేను సినిమాల్లో నటించారు. ఆమె నటించిన గ్రహణం సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. శృంగార, హాస్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న జయలలిత మంచి డ్యాన్సర్ కూడా. నటిగా ఎంతో పేరు సంపాదించుకున్న జయలలిత వైవాహిక జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారట. తాజాగా కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ప్రేక్షకులకి సైతం బాధ కలిగించాయి.

జయలలిత వినోద్ అనే కన్నడ డైరెక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 7 సంవత్సరాల ప్రేమించుకున్నాక వివాహం చేసుకున్నారట. వినోద్ తల్లిదండ్రులు అప్పట్లో బీ గ్రేడ్, సీ గ్రేడ్ సినిమాలు తీస్తుండేవారట. వారితో కలిసి పనిచేస్తున్న సమయంలో అతని కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడిందట. తనను చాలా ఇష్టపడినట్లు నమ్మించి బ్లడ్‌తో ఉత్తరాలు రాసేవాడట.  అతని ప్రేమ నిజమని నమ్మి జయలలిత పెళ్లి చేసుకున్నారట. పెళ్లైన వెంటనే ఆస్తి కోసం వేధించడం మొదలయ్యాయట.. కొట్టి చిత్రహింసలు పెట్టడం, డబ్బు తీసుకురాకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించేవాడట. అప్పటికే అతని అప్పులు తీర్చడానికి 50 లక్షలతో పాటు నగలు మొత్తం పోగొట్టుకున్నారట జయలలిత.

Keedaa Cola : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. కీడా కోలా వచ్చేది ఎప్పుడంటే?

చివరికి వినోద్ ఒకరోజు గదిలో పెట్టి యాసిడ్ పోసి చంపుతానని బెదిరించడంతో విషయం తెలుసుకున్న నటుడు చలపతిరావు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ సాయంతో అతని ఇంటి నుంచి బయటకు వచ్చేసానని జయలలిత తాజా ఇంటర్వ్యూల్లో  వెల్లడించారు. లేదంటే తాను అక్కడే చనిపోయి ఉండేదానినని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తరువాత జయలలిత వినోద్‌తో విడాకులు తీసుకున్నారట. అతను మరో పెళ్లి చేసుకున్నాడట. ఆ తరువాత జరిగిన యాక్సిడెంట్ కారణంగా వినోద్ మంచానికి పరిమితం అయ్యాడని జయలలిత చెప్పుకొచ్చారు.

నటిగా నిలదొక్కుకోవడానికి కెరియర్లో పడ్డ కష్టాలు ఒకవైపు.. వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరోవైపు అన్నీ ఎదుర్కొన్న జయలలిత ప్రస్తుతం తనకు వచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.