Inaya Sulthana
Inaya Sulthana : ఇటీవల శివాజీ ఓ సినిమా ఈవెంట్లో హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకోండి, చీరలు కట్టుకోండి అని చెప్తూ రెండు పదాలు తప్పుగా మాట్లాడారు. దీంతో కొంతమంది శివాజీని టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో బయట జనాలు, మహిళలు, సోషల్ మీడియా అంతా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. పలువురు సినీ మహిళా సెలబ్రిటీలు మాత్రం శివాజీ పై ఫైర్ అవుతున్నారు.(Inaya Sulthana)
తాజాగా శివాజీ చేసిన కామెంట్స్ పై నటి ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఫైర్ అయింది.
Also See : Vishnupriyaa Bhimeneni : గోవా బీచ్ లో బికినీ వేసి రచ్చ చేస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. ఫొటోలు వైరల్..
ఇనయా సుల్తానా మాట్లాడుతూ.. బ్లౌజ్ లేకుండా చీర కట్టుకుంటాం అదే మన కల్చర్. పూర్వ కాలంలో రాజులు పరిపాలించేటప్పుడు అలాగే వేసుకున్నారు కదా. మన గుడి మీద కూడా అలాగే బొమ్మలు చెక్కి ఉంటాయి. వాటికి కూడా చీర ఉంటుంది కానీ బ్లౌజ్ ఉండదు. వాళ్లకు అవి అందంగా కనిపించాయి కాబట్టే చెక్కారు. ఉదాహరణకు పొన్నియన్ సెల్వన్ సినిమాలో అందరూ ఆడవాళ్లు, రాణులు బ్లౌజ్ లేకుండానే చీరకట్టుకుంటారు.
ఇప్పుడు వల్గర్ గా చూస్తున్నారు జనాలు అందుకే అది వల్గర్ గా కనిపిస్తుంది. శివాజీ గారు ఇంకా మంగపతి క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. మగాళ్లు ఆడవాళ్లను రూల్ చేస్తున్నారు. ఇండియాలో ఇది పోవాలి. సినిమాల్లో చిన్న బట్టలు వేయిస్తున్నారు కదా. సినిమాల్లో ఆపమనండి. ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు బోల్డ్ గా చూపించుకోవాలి అనుకుంటారు. అందుకే బట్టలు కూడా అలాగే వేసుకుంటారు. హాలీవుడ్ వాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటే అడుగుతారా? ఇండియన్ కల్చర్ ని ఫాలో అయ్యి బ్లౌజ్ లేకుండా చీర కట్టుకోవాలి కదా మరి అంటూ ఫైర్ అయింది.
Also See : Sobhita Dhulipala : చెన్నైలో ఈవెంట్ కి హాజరయిన శోభిత.. స్టైలిష్ లుక్స్ లో ఫోటోలు వైరల్..