Negative : సెలబ్రిటీలు, నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘నెగెటివ్’..
‘బిగ్ బాస్ 5’ (తెలుగు) ఫేమ్ శ్వేత వర్మ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘నెగెటివ్’ కి హ్యూజ్ రెస్పాన్స్..

Negative
Negative: గతకొద్ది రోజులుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ‘నెగెటివ్’ ఫిలిం గురించే డిస్కషన్ నడుస్తుంది. కంటెంట్‌లో కొత్తదనం ఉంటే చాలు.. తెలుగు ఆడియన్స్ థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేసింది ‘నెగెటివ్’..
Negative : ఇంట్రెస్టింగ్‌గా సైకలాజికల్ థ్రిల్లర్ ‘నెగెటివ్’ ట్రైలర్..
గతేడాది ఉగాది రోజు ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తమ యూట్యూబ్ ఛానల్‌లో ‘నెగెటివ్’ ట్రైలర్ అప్‌లోడ్ చేసింది. ఇటీవల ‘బిగ్ బాస్ 5’ షో లో పార్టిసిపెట్ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకున్న బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్ శ్వేత వర్మ, విక్రమ్ శివ మెయిన్ లీడ్స్‌గా.. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ప్రజెంట్ జనరేషన్ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా బాల సతీష్ ఈ ‘నెగెటివ్’ ఇండిపెండెంట్ ఫిలింని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.

ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఎఎమ్. రాజేష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ కమ్ యాక్టర్ దయానంద్ రెడ్డి (‘పుష్ప’ లో రష్మిక తండ్రి) ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించారు. ఛాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌లో జనవరి 2న ‘నెగెటివ్’ ఫిలిం అప్‌లోడ్ చేశారు. రిలీజ్ చేసినప్పటి నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. పలు సోషల్ మీడియా పేజెస్ సినిమాను ప్రమోట్ చేసాయి.

నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు సైతం ‘నెగెటివ్’ చూసి తమ సపోర్ట్‌గా వారి ప్రొఫైల్స్‌లో సినిమా గురించి పోస్టులు చేయడం విశేషం. ‘బిగ్ బాస్ 5’ లో శ్వేతతో పాటు ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ ప్రమోట్ చేశారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నవీన్ చంద్ర సినిమా చూసి టీంకి విషెస్ చెప్పారు.


శ్వేత వర్మ, విక్రమ్‌ల నేచురల్ పర్ఫార్మెన్స్, నాని చమిడిశెట్టి విజువల్స్, విజయ్ కూరాకుల బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇండిపెండెంట్ ఫిలిం అయినా ఫీచర్ ఫిల్మ్‌లా తెరకెక్కించాడంటూ దర్శకుడు బాల సతీష్‌ని ప్రశంసిస్తున్నారంతా. 48 నిమిషాల డ్యురేషన్‌తో ఉన్న ‘నెగెటివ్’ చూస్తున్నంత సేపు థ్రిల్లింగ్ కలుగుతుంది.
Watch Film