మోహన్ బాబు.. మీ అమ్మాయిని చూసి నేర్చుకో..
సోషల్ మీడియాలో మరోసారి చిరు, మోహన్ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ..

సోషల్ మీడియాలో మరోసారి చిరు, మోహన్ బాబుల మధ్య ఆసక్తికర సంభాషణ..
మెగాస్టార్ చిరంజీవి, మార్చి 25న ఉగాది పర్వదినం సందర్భంగా పలు సోషల్ మీడియా మాద్యమాల్లోకి అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎంట్రీ పై పలువురు ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, కొందరు సినిమా ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ తమ అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
అందులో భాగంగా కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ మోహన్ బాబు, ట్విట్టర్‌కి ‘స్వాగతం మిత్రమా’ అంటూ మెగాస్టార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేయగా, ‘రాననుకున్నావా, రాలేననుకున్నావా’ అంటూ సరదాగా మోహన్ బాబు ట్వీట్‌ని మెగాస్టార్ రీట్వీట్ చేశారు. దానికి సమాధానంగా మోహన్ బాబు, ‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెప్తాను’ అని రిప్లై ఇచ్చారు. తాజాగా చిరంజీవి.. మోహన్ బాబు ఇచ్చిన ‘హగ్’ రిప్లయ్‌కి సమాధానమిచ్చారు.
‘‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. నో హగ్స్, నో షేక్ హ్యాండ్స్.. ఓన్లీ నమస్తే. సామాజిక దూరం తప్పనిసరి. ఇంకా.. మనకు దగ్గరగా ఉండేవారి నుంచి, మన బంధువుల నుంచి ఎలా రక్షణ పొందాలో మన మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు..’’ అని చిరు ట్వీట్ చేయగా.. దీనికీ మోహన్ బాబు స్పందించారు. ‘‘మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం..’’ అని మోహన్‌బాబు ఇచ్చిన రిప్లయ్ ఇచ్చారు. చిరు, మోహన్ బాబుల సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం. @KChiruTweets https://t.co/7u5N2S6gOZ
— Mohan Babu M (@themohanbabu) March 28, 2020