Narne Nithiin – Aay Movie : వర్షం, మబ్బుల కోసం అయిదు నెలలు ఆగిపోయిన ఎన్టీఆర్ బామ్మర్ది సినిమా షూట్..

ఆయ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్, లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.

Interesting Facts about Narne Nithiin Aay Movie by Producer Bunny Vasu

Narne Nithiin – Aay Movie : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా నిన్న ఆగస్టు 15 సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో విడుదలయింది. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజి మణిపుత్ర దర్శకత్వంలో ఈ ఆయ్ సినిమా తెరకెక్కగా ఇందులో నయన్ సారిక హీరోయిన్ గా సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

అయితే ఆయ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాతో ఫుల్ గా నవ్వించారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్, లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అంతా. ఆయ్ సినిమాని అమలాపురం, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో షూట్ చేసారు. ఒక్క సాంగ్ తప్ప సినిమా అంతా గోదావరి జిల్లాల్లోనే షూట్ చేసారు. సినిమాలో ఆల్మోస్ట్ 70 శాతం వర్షంలోనే సీన్స్ ఉంటాయి. చుట్టూ పచ్చని అందాలు కనిపిస్తాయి. ఆయ్ సినిమా చూస్తుంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. గోదావరి జిల్లాల్లోని పచ్చని అందాలు, ఆ లొకేషన్స్, చెట్లు, వర్షం.. ఇలా సినిమా అంతా గ్రీనరీతో నింపేశారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి. అయితే ఇంత బాగా విజువల్స్ రావడానికి చాలా కష్టపడ్డారు, ఖర్చుపెట్టారు కూడా.

Also Read : Jani Master : రెండోసారి జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు.. ఈసారి కూడా తెలుగు సినిమాకు కాదు..

తాజాగా సినిమా నిర్మాత బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కథ చెప్పినప్పుడు నార్మల్ షూట్ లాగా కాకుండా కొత్తగా తీయాలనుకున్నాము. అందుకే వర్షాకాలంలోనే షూట్ చేద్దామని, సినిమాలో లైటింగ్ ప్యాట్రన్ కూడా కొత్తగా చూపించాలని ఎండ లేనప్పుడే షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే రియల్ వర్షం, మబ్బులు ఉన్నప్పుడే షూట్ చేయాలనుకున్నాం. దీంతో గత సంవత్సరం జనవరిలో మొదలుపెట్టాలిసిన షూట్ ఆల్మోస్ట్ అయిదు నెలలు ఆపి జులై – ఆగస్టులో మొదలుపెట్టాము. వర్షం లేక, మబ్బులు లేక, కావాల్సిన లైటింగ్ లేక మధ్యలో చాలా సార్లు షూటింగ్ ఆగిపోయింది. వర్షం లేని సీన్స్ లో కూడా వర్షం పడి ఆగినట్టు సీన్ లో బ్యాక్ గ్రౌండ్ అంతా నీళ్లతో తడిపాము. దీనికి కూడా బాగానే ఖర్చయింది. ఈ సినిమాకు మాకు మంచి విజువల్స్ కోసం తీసుకున్న టైంకే బాగా ఎక్కువ ఖర్చయింది. ఇప్పుడు అందరూ ఆ విజువల్స్ గురించే మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు