Jani Master : రెండోసారి జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు.. ఈసారి కూడా తెలుగు సినిమాకు కాదు..
తెలుగు డ్యాన్స్ మాస్టర్ రెండు సార్లు వేరే భాషల్లో నేషనల్ అవార్డు అందుకోవడం గమనార్హం.

Jani Master Wins National Best Dance Choreographer in 70th National Film Awards
Jani Master : టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ్, కన్నడ, హిందీ లో కూడా బిజీ అయ్యారు. తాజాగా నేడు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. 70వ నేషనల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవార్డు ప్రకటించారు.
తమిళ్ లో తెరకెక్కిన ధనుష్ తిరుచిత్రంబళం సినిమాలో మేఘం కరుకత.. సాంగ్ కి బెస్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అవార్డు ప్రకటించారు. అయితే ఈ పాటకు జానీ మాస్టర్ తో పాటు సతీష్ కృష్ణన్ కూడా కంపోజ్ చేసారు. దీంతో ఈ ఇద్దరూ అవార్డుని అందుకోనున్నారు. ఈ సినిమా తెలుగులో తిరు సినిమాగా రిలీజయి ఇక్కడ కూడా హిట్ అయింది. మేఘం కరిగెనే పిల్లో పిల్లై.. అని తెలుగులో కూడా ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ సాంగ్ లో చీకట్లో సింపుల్ లైట్ తో సింపుల్ స్టెప్స్ తో సాంగ్ ని అందంగా చిత్రీకరించారు. ఈ పాట సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయి చాలా మంది రీల్స్ చేశారు.
జానీ మాస్టర్ గతంలో కూడా 67వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్నారు. అప్పుడు కన్నడ సినిమా యువరత్నలోని సాంగ్ కి అందుకున్నారు. తెలుగు డ్యాన్స్ మాస్టర్ రెండు సార్లు వేరే భాషల్లో నేషనల్ అవార్డు అందుకోవడం గమనార్హం. దీంతో జానీ మాస్టర్ కి సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
View this post on Instagram