Pushpa 3 : పుష్ప 3 కచ్చితంగా తీయాల్సిందే.. పుష్ప 3 కథేంటి? ఇంకో కొత్త విలన్? ఆల్రెడీ కొంత షూటింగ్ పూర్తి..

పుష్ప 3 లో కథేం ఉంటుంది అని ఆసక్తి నెలకొంది.

Interesting Points about Allu Arjun Pushpa 3 Leads Gives in Pushpa 2

Pushpa 3 : అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయి దూసుకుపోతుంది. మంచి ఎలివేషన్స్ తో అదిరిపోయే సీక్వెన్స్ లతో పుష్ప 2 ప్రేక్షకులను మెప్పించింది. అయితే పుష్ప 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు కానీ ఎప్పుడు ఉంటుందో మాత్రం చెప్పలేమన్నారు. పుష్ప 2 సినిమాలో పుష్ప 3కి అనేక లీడ్స్ ఇచ్చారు, చివర్లో పుష్ప 3 టైటిల్ కూడా వేశారు. దీంతో పుష్ప 3 లో కథేం ఉంటుంది అని ఆసక్తి నెలకొంది.

#పుష్ప 2 సినిమాలో పుష్ప జపాన్ కి వెళ్లి అక్కడ ఫైట్ చేసినట్టు ఒక సీన్ చూపించారు. ఈ సీన్ దేనికి అనేది క్లారిటీ లేదు. ఈ సీన్ పార్ట్ 3 లో కంటిన్యుటీ ఉంటుందని తెలుస్తుంది.
#అలాగే పుష్పకు వ్యతిరేకంగా అందరూ ఒకేచోట కలిసినట్టు క్లైమాక్స్ లో చూపించారు. మరి వీళ్లంతా కలిసి ఏం చేస్తారు తెలియాలంటే పుష్ప 3 చూడాల్సిందే.
#పుష్ప భార్య శ్రీవల్లి ప్రగ్నెంట్ అని చూపించారు. కాబట్టి బుల్లి పుష్ప పుట్టాలి. అది కూడా పార్ట్ 3 లోనే.
#అలాగే గతంలో పుష్పని అరెస్ట్ చేసారు, జైలు నుంచి తప్పించుకున్నాడు అని ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు. కానీ ఆ గ్లింప్స్ లో చూపించింది ఏది సినిమాలో లేదు. దీంతో అవి కూడా పార్ట్ 3 లోనే ఉంటాయి.
#ఇక పుష్ప ట్రైలర్ లో చూపించిన కొన్ని షాట్స్ కూడా సినిమాలో లేవు అవి కూడా పార్ట్ 3 లోనే ఉంటాయని అర్ధమవుతుంది.
#పుష్ప 2 క్లైమాక్స్ లో ఓ కొత్త విలన్ వచ్చినట్టు చూపించారు కానీ ఫేస్ చూపించలేదు. దీంతో ఆ కొత్త విలన్ ఎవరో తెలియాలి.
#పుష్ప 1లో బెడ్ కి పరిమితమైన జాలిరెడ్డి పార్ట్ 2 క్లైమాక్స్ లో లేచి వస్తాడు. పుష్ప పై అతని రివెంజ్ కూడా పార్ట్ 3 లోనే.

Also Read : Pavani Karanam : పుష్ప 2లో అల్లు అర్జున్‌ని చిన్నాన్న అని పిలిచే ఆ నటి ఎవరో తెలుసా..? సినిమా కథని మలుపు తిప్పే పాత్ర..

ఇలా పార్ట్ 2 లోనే చాలా లీడ్స్ ఇవ్వడం, గ్లింప్స్, ట్రైలర్స్ లో చూపించిన సీన్స్ సినిమాలో లేకపోవడంతో వాటికి ముగింపు తెలియాలంటే కచ్చితంగా పార్ట్ 3 తీయాల్సిందే అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఆ సీన్స్ అన్ని ముందే షూటింగ్ చేసేసారు కాబట్టి పుష్ప 3 లో కొంత భాగం షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఒప్పుకుంటే, ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పుష్ప 3 తీస్తానని సుకుమార్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. దీంతో పుష్ప 3 ఎప్పుడు తీస్తారు అనేది బన్నీ చేతిలోనే ఉంది.