మీరెలాగైనా కొట్టుకోండి నన్ను మాత్రం ఎంటర్ టైన్ చెయ్యండి. ఇది ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్. సరిగ్గా బిగ్ బాస్ కూడా అట్టాగే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. అందుకే కంటెస్టెంట్ల మధ్య గట్టిగా పుల్లలు పెట్టేస్తున్నాడు. కంటెంట్ ఇవ్వకుంటే మనమే పిండుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అనుకుంటా.. గట్టి సెటెప్ నే సెట్ చేశాడు. గార్డెన్ ఏరియాలోకి అందరినీ పిలిచేసి ఒక్కొక్క కంటెస్టెంట్ కి మరో కంటెస్టెంట్ తన గురించి నెగెటివ్ గా మట్లాడుకునే వీడియోని చూపించారు.
ఇంటిసభ్యులు దసరా సంబరాల్లో స్పెషల్ గెస్ట్‌గా ఇంట్లో అడుగుపెట్టిన నాగ్ ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్‌లు చేయించాడు. వచ్చీరావడంతోనే వారికి స్వీట్లు తినిపించి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక హౌస్‌మేట్స్ చేసే అల్లరి మామూలుగా లేదు. వారి ఆటపాటలతో జోష్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది ఆ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ అవ్వగానే మరుసటి ఎపిసోడ్.. అంటే ఇవ్వాళ ప్రసారం అయ్యే ఎపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడు.
ఒక్కొక్క కంటెస్టెంట్ కు సంబంధించిన దిష్టిబొమ్మలను పెట్టి.. మరో కంటెస్టెంట్ ను పిలిచి వారికి వీడియో చూపించి దిష్టిబొమ్మకు పెట్టిన తలను పగలగొట్టించాడు. కుండ బద్దలు కొట్టినట్లు నిజం బయటపడింది అనే ఈ టాస్క్ కు సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా విడుదలైంది. ఈ ప్రోమోలో బాబా భాస్కర్ గురించి రాహుల్ కి, మహేష్ గురించి శ్రీముఖికి, శ్రీముఖి గురించి ఆలీకి చూపించారు. ఇలా మొత్తానికి అందరికీ పుల్లలు పెట్టేశాడు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ లో ఉండేది మూడు వారాలే కావడంతో అసలు గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్ అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
Kunda baddalakottinattu nijam bayatapadindi #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/KVpnuSDWUE
— STAR MAA (@StarMaa) October 10, 2019