అను, అర్జున్‌లను చూశారా!

యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ రిలీజ్..

  • Publish Date - March 29, 2020 / 11:42 AM IST

యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ రిలీజ్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాంచి జోరుమీదున్నాడు.. ఒకదాని తర్వాత ఒకటి వరసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్, చంద్రశేఖర్ యేలేటితోనూ ఓ సినిమా చేస్తున్నాడు. యాక్టర్ నుండి రైటర్ అండ్ డైరెక్టర్‌గా టర్న్ అయ్యి.. ‘తొలిప్రేమ’, ‘Mr.మజ్ను’ సినిమాలతో  గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. ‘రంగ్‌దే !’ అనే రొమాంటిక్ లవ్‌స్టోరిలో నటిస్తున్నాడు. ‘గిమ్మీ సమ్ లవ్‘ అనేది ట్యాగ్‌లైన్.

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా.. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై.. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్లు ఒకరినొకరు తన్మయత్వంతో చూసుకుంటున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. మోషన్ పోస్టర్ ద్వారా నాయకా నాయికలు అను, అర్జున్‌లను పరిచయం చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

నితిన్ హీరోగా నటిస్తున్న 29వ సినిమా ఇది.  తెలుగులో ‘ఇష్క్’ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరుపవద్దని, ఈ పరిస్థితుల్లో తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపాడు నితిన్.