Shyam Singha Roy : ఈసారి థియేటర్లలోనే..

నాని నటిస్తున్న‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సినిమా నుండి వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ రిలీజ్..

Shyam Singha Roy : ఈసారి థియేటర్లలోనే..

Shyam Singha Roy

Updated On : October 14, 2021 / 4:25 PM IST

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

Maha Samudram : రివ్యూ

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. గురువారం సాయంత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. నాని నటించిన గత రెండు సినిమాలు ‘వి’, ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదలయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ తో థియేటర్లలోకి రాబోతున్నాడు.

Shyam SinghaRoy : ఆరున్న‌ర కోట్ల‌తో హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నాని శ్యామ్ సింగ‌రాయ్’ ఫైన‌ల్ షెడ్యూల్..

ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.