Irrfan Khan Death : ఇర్ఫాన్ ఖాన్.. తన మరణం గురించి ముందే కొడుకు బాబిల్ ఖాన్‌తో చెప్పాడంట!

దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దార్ తన భర్త మరణం గురించి ముందే చెప్పారని అన్నారు. ఇర్ఫాన్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన లేని లోటు తమను ఎంతో బాధిస్తోందని ఆమె ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు.

Irrfan Khan Death Anniversary

Irrfan Khan Death Anniversary : దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దార్ తన భర్త మరణం గురించి ముందే చెప్పారని అన్నారు. ఇర్ఫాన్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన లేని లోటు తమను ఎంతో బాధిస్తోందని ఆమె ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇర్ఫాన్ చనిపోవడానికి ముందు.. ‘నవ్వుతూ నేను చనిపోబోతున్నా’ అంటూ కుమారుడు బాబిల్ ఖాన్ కు చెప్పాడని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు సుతాపా సిక్దార్. విద్యార్థులుగా ఉన్నప్పుడే తామిద్దరం నేషనల్ స్కూల్ డ్రామాలో కలుసుకున్నామని తెలిపారు. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ తో సుదీర్ఘ కాలం మృత్యువుతో పోరాడిన ఇర్ఫాన్ ఏప్రిల్ 29, 2020న మరణించాడు.



ఇర్ఫాన్ మరణం గురించి ముందే ఊహించాడు.. తన జీవితం ఏమౌతుందో వివరించాడు. క్యాన్సర్‌ అని నిర్ధారణ అయినప్పుడే తన మరణానికి దగ్గరవుతున్నానని భావించాడని ఆమె చెప్పుకొచ్చింది. ‘మేము కలిసిన రోజు నుంచి ఇర్ఫాన్ మరణాన్ని ముందే ఆహ్వానించాడు. అతడు ఒక ముస్లిం కుటుంబం నుండి వచ్చాడు. నేను హిందూ నేపథ్యం నుండి వచ్చాను. జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉండేది.. అతని కెరీర్‌కు ఏమి జరుగుతుందో తెలియదు కానీ, తదుపరి జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎక్కువగా ఉండేది. తాను రోజురోజుకీ మరణానికి దగ్గరవుతున్నానే విషయాన్ని ముందుగానే తెలియజేశాడు’ అని తెలిపింది.



ఇర్ఫాన్ చికిత్స పొందుతున్నంతసేపు 24/7 తన అవసరం ఉండేదని సుతాపా చెప్పారు. ఆస్పత్రికి వెళ్ళే ముందు.. అంతా బాగానే ఉందని అతను హామీ ఇచ్చాడని గుర్తుచేసుకున్నారు. మంచం అంచున కూర్చుని, అతను చాలా బలహీనంగా ఉన్నాడు. ప్యాంటు కూడా వేసుకునే పరిస్థితి లేదు. జుట్టును దువ్వాను.. నా చేయి పట్టుకొని లేచాడు. మేము ఒకరినొకరు కౌగిలించుకున్నామని సుతాపా గుర్తుచేసుకుంటూ కన్నీరుపెట్టారు. బాబిల్ తన ‘బాబా’ ఇర్ఫాన్ ఖాన్‌తో తన చివరి క్షణాల గురించి కూడా మాట్లాడాడు. నేను గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నాను. స్పృహ కోల్పోతున్నాడు. అతను నన్ను చూస్తూ.. నవ్వి, ‘నేను చనిపోతాను’ అని అన్నాడు. నేను, ‘లేదు అన్నాను. అతను మళ్లీ నవ్వి తిరిగి నిద్రలోకి వెళ్లాడు. అలా కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.