Is AP minister Nara Lokesh as a Chief Guest for Daaku maharaaj pre release event
నందమూరి నటసింహం నటిస్తున్న మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 8న లేదా 9న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.
Dil Raju : బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం.. దిల్ రాజు
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బాలయ్య అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రానున్నారని అంటున్నారు. మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లుడు రానున్నాడు అనే వార్తతో ఫ్యాన్స్‌లో ఆనందం రెట్టింపు అయింది.
ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లు కథనాయికలు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చాయి. ఈ క్రమంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Kannappa : పార్వతీదేవీగా కాజల్ అగర్వాల్.. కన్నప్ప నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల..