Dil Raju : బాధిత కుటుంబాల‌కు రూ.5 లక్ష‌ల చొప్పున‌ సాయం.. దిల్ రాజు

ఇద్ద‌రు అభిమానులు చ‌నిపోవ‌డం ఎంతో బాధాక‌రమ‌న్నారు.

Dil Raju : బాధిత కుటుంబాల‌కు రూ.5 లక్ష‌ల చొప్పున‌ సాయం.. దిల్ రాజు

Dil Raju react on fans death announce Rs 5 lakh financial assistance

Updated On : January 6, 2025 / 12:02 PM IST

రాజ‌మండ్రిలో శ‌నివారం గేమ్ ఛేంజ‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించారు. కాగా.. ఈ వేడుక‌లో పాల్గొని ఇంటికి వెలుతున్న క్ర‌మంలో కాకినాడ‌కు చెందిన ఆర‌వ మ‌ణికంఠ‌, తోకాడ చ‌ర‌ణ్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌మాద వ‌శాత్తు మ‌ర‌ణించారు. ఈ విష‌యం పై దిల్ రాజు స్పందించారు.

మీడియా స‌మావేశంలో మాట్లాడుతుండ‌గా దిల్‌రాజుకు ఈ విష‌యం తెలిసింది. వెంట‌నే ఆయ‌న స్పందించారు. రాజ‌మండ్రిలో జ‌రిగిన గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘ‌నంగా జ‌రిగింద‌ని, ఈ విష‌యం పై ఎంతో సంతోషంగా ఉన్న‌ట్లు చెప్పారు. కాగా.. తిరుగు ప్ర‌యాణంలో ఇద్ద‌రు అభిమానులు చ‌నిపోవ‌డం ఎంతో బాధాక‌రమ‌న్నారు. వారి కుటుంబాల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పుకొచ్చారు.

Kannappa : పార్వ‌తీదేవీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. క‌న్న‌ప్ప నుంచి అదిరిపోయే పోస్ట‌ర్ విడుద‌ల‌..

త‌న వంతు సాయంగా.. మృతుల కుటుంబాలకు రూ.5ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయ‌నున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వారి కుటుంబాల్లో ఎంత‌టి బాధ ఉంటుందో తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని అన్నారు. వారికి త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. కియారా అద్వానీ క‌థానాయిక‌. ఎస్‌జే సూర్య‌, అంజ‌లిలు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి.

Pushpa 2 : ‘పుష్ప 2’ సరికొత్త రికార్డు.. బాక్సాఫీస్ వ‌ద్ద ఆగేదేలే..