Alia Bhatt : ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురు ఫోటో షేర్ చేసిన అలియా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గత ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి గత ఏడాది నవంబర్ లోనే ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. కాగా తమ కుమార్తె ఫోటోని ఇప్పటి వరకు అలియా అండ్ రణ్‌బీర్ ఎక్కడ బయట పెట్టలేదు. తాజాగా..

Alia Bhatt daughter

Alia Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గత ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి గత ఏడాది నవంబర్ లోనే ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. ఆ పాపకి ‘రహా’ అనే పేరుని కూడా పెట్టారు. కాగా తమ కుమార్తె ఫోటోని ఇప్పటి వరకు అలియా అండ్ రణ్‌బీర్ ఎక్కడ బయట పెట్టలేదు. ఆ పాపకు రెండేళ్లు వచ్చే వరకు తమ కుమార్తె పేస్ ని సోషల్ మీడియాలో రివీల్ చేసేది లేదంటూ ఈ స్టార్ కపుల్ తమ సన్నిహితులతో చెప్పుకొచ్చారు.

Alia Bhatt : పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం నా ఇష్టం.. అలియాభట్ వ్యాఖ్యలు..

కాగా ఇప్పుడు ఒక పాప ఫోటోను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. Ed-a-Mamma బేబీ వేర్ డ్రెస్సెస్ గురించి ప్రమోట్ చేస్తూ, పింక్ డ్రెస్ లో ఉన్న ఒక పాప ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన నెటిజెన్లు.. ఆ పాప అలియా కూతురే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ పాప అలియా కూతురా? కదా? అనేది అలియానే చెప్పాలి. ప్రస్తుతం మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న అలియా తన కూతురుకి 2 ఏళ్ళు వచ్చే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అలియా ఆల్రెడీ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఇంగ్లీష్ ఫిలిం ‘హార్ట్ అఫ్ స్టోన్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. దీంతో పాటు రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహాని’ అనే రొమాంటిక్ కామెడీ ఫిలింలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది జులై 28న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మరో ఏ సినిమాకి అలియా సైన్ చేయలేదు.