Mahesh Babu : మహేష్ బాబుతో రాజ్ అండ్ డీకే మూవీ.!?
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.
Is Mahesh Babu Next Movie Project Raj Nidimoru
Mahesh Babu : సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటి నుంచే కథలు వింటున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రముఖ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఇటీవల మహేష్‌కు ఓ ఆసక్తికరమైన కథను నరేట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాజ్&డీకే మహేష్ కాంబినేషన్‌పై పలుసార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
Rithu chowdary : చీర కట్టులో సాంప్రదాయంగా రీతూ చౌదరి.. ఫోటోలు వైరల్..
ఈ సారి కథపై మహేష్ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు, ప్రాజెక్ట్‌పై ప్రైమరీ డిస్కషన్స్ జరుగుతున్నట్లు టాక్. ఈ కాంబినేషన్ ఓకే అయితే మహేష్ కెరీర్లో ఇది 30వ సినిమాగా ఉండే అవకాశం ఉందట. రాజ్ అండ్ డీకే తమ సినిమాల్లో కొత్త తరహా కథనం, డార్క్ హ్యూమర్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అలాంటి మేకర్స్‌తో మహేష్ జతకడితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నమైన జానర్లో మూవీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే మహేష్‌తో రాజ్ & డీకే ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
