Nithya Menen: తల్లి కాబోతున్న నిత్యా మీనన్.. నిజమేనా?

ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా నిలదొక్కుకున్న హీరోయిన్లు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకరు టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ చూసి అందరూ షాక్ కి గురవుతున్నారు. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ...

Is Nithya Menen going to be a mother?

Nithya Menen: ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా నిలదొక్కుకున్న హీరోయిన్లు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒకరు టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీస్తూ తనకంటూ సినీ రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది.

Nithya Menon : అంత ఈజీ అయితే వాళ్ళే సినిమాలు తీయొచ్చుగా.. సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్లపై నిత్యామీనన్ ఫైర్..

తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ చూసి అందరూ షాక్ కి గురవుతున్నారు. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని అప్లోడ్ చేసింది. దీంతో అసలు పెళ్లి కానీ ఈ హీరోయిన్ గర్భవతి ఎలా అయ్యిందంటూ తికమక్కలో పడ్డారు నెటిజెన్లు. అయితే అదే ఫోటోను మలయాళ నటి పార్వతి కూడా షేర్ చేయడం విశేషం.

ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే చిత్రాన్ని షేర్ చేయడంతో.. ఇది సినిమా ప్రమోషన్ కోసం అని తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒక సినిమాకి పనిచేయబోతున్నట్లు సమాచారం. ఆ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఇక ఇటీవల ధనుష్ హీరోగా నిత్యామీనన్ నటించిన తిరు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.