Varun Tej – Lavanya Tripathi : వరుణ్‌పై మనసు పారేసుకున్న అందాల రాక్షసి.. ప్రేమ వార్త నిజమేనా?

ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన జంట ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రహస్య ప్రేమాయణం నడుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.

Varun Tej - Lavanya Tripathi

Varun Tej – Lavanya Tripathi : ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన జంట ఇప్పుడు ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి రహస్య ప్రేమాయణం నడుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట.. ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని గతంలో కూడా వార్తలు వినిపించగా, ఆ వార్తల్లో నిజం లేదంటూ హీరోయిన్ లావణ్య కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్త హెడ్‌లైన్స్ లోకి వచ్చింది.

Varun Tej : త్వరలో వరుణ్ తేజ్ తన భార్యని పరిచయం చేస్తాడు.. నాగబాబు!

లావణ్య ప్రస్తుతం ఆది సాయి కుమార్ తో కలిసి ‘పులిమేక’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ ట్రైలర్ ని ఇటీవల రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ జీ-5 లో ఇది ప్రసారం కాబోతుంది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న ఒక టాక్ షోకి చిత్ర యూనిట్ అతిధులుగా హాజరయ్యారు. ఈ షోలో సుమ.. నాని, వరుణ్ తేజ్ ఇద్దరిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? అని ప్రశ్నించింది. దీనికి లావణ్య బదులిస్తూ.. వరుణ్ తేజ్ పేరు చెప్పింది. ఆ ఆన్సర్ కి అక్కడు ఉన్న వారు అంతా ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. దీంతో లావణ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడింది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో, వీరిద్దరి ప్రేమ రుమౌర్స్ మరోసారి తెర పైకి వచ్చాయి. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని, ఆ విషయాన్ని మరియు వధువుని అతనే అనౌన్స్ చేస్తాడు అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు లావణ్య ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజెన్లు వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది ఆమెనే అంటూ కామెంట్లు చేస్తున్నారు.