Oscar 2023 : ఆస్కార్ రెడ్ కార్పెట్ మార్చడానికి కారణం విల్ స్మిత్?

ఆస్కార్ తన 60 ఏళ్ళ ట్రేడిషన్ ని బ్రేక్ చేస్తూ కార్పెట్ కలర్ ని రెడ్ నుంచి షాంపైన్ కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ, ఆ విషయం పై ఒక సీరియస్ జోక్ అయితే వేసింది.

Is Will Smith the reason to change the Oscars red carpet to champagne?

Oscar 2023 : ప్రపంచంలోని సినీ నటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం ఆస్కార్. ఇక అవార్డుని అందుకోకపోయిన పర్వాలేదు, ఒక్కసారైనా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిస్తే చాలు అదే గౌరవంగా భావిస్తుంటారు ప్రతిఒక్కరు. ఆ రెడ్ కార్పెట్ పై నడిచేందుకు ప్రత్యేకమైన డిజైన్ వేర్ తో సిద్దమయ్యి వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ తన కార్పెట్ రంగుని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రెడ్ కార్పెట్ కాస్త షాంపైన్ రంగులోకి మారిపోయింది. రంగు మార్చడం గురించి అకాడమీ కచ్చితమైన రీజన్ అయితే వెల్లడించనప్పటికీ, ఆ విషయం పై ఒక సీరియస్ జోక్ అయితే వేసింది.

Oscar 2023 : ఆస్కార్ అమ్ముకోవచ్చు తెలుసా.. అమ్మితే వచ్చే రేటు తెలిస్తే షాక్ అవుతారు!

ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకకు హోస్ట్ గా అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. కలర్ చేంజ్ గురించి మాట్లాడుతూ.. ”గత ఏడాది హాస్యనటుడు క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం వలన అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది. అందుకనే ఈ సంవత్సరం 60 ఏళ్ళ ట్రేడిషన్ ని బ్రేక్ చేస్తూ కార్పెట్ కలర్ ని రెడ్ నుంచి షాంపైన్ కి మారుస్తున్నాము. దీంతో ఈ ఇయర్ ఎటువంటి చెంపదెబ్బలు ఉండవని భావిస్తున్నా” అంటూ చమత్కరిస్తూ మాట్లాడాడు.

Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

కాగా గత ఏడాది విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి హాస్యనటుడు క్రిస్ రాక్‌ జోక్ చేస్తూ మాట్లాడడంతో స్మిత్ కోపం వచ్చి క్రిస్ రాక్ పై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అకాడమీ.. విల్ స్మిత్ పై 10 ఇయర్స్ బ్యాన్ కూడా విధించింది. దీంతో ఈ ఏడాది ఇలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మార్చి 12 రాత్రి ఆస్కార్ అవార్డ్స్ మొదలు కానున్నాయి. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక్ష ప్రసారం చూడవచ్చు.