Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎంట్రీపై ఇషా చావ్లా ఫుల్ క్లారిటీ!

బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా.. మరోసారి మన్మధుడితో ప్రోమో షూటింగ్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఈ షో మొదలు కానుందని తెలుస్తుండగా మరోవైపు కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఇప్పటికే ఓ జాబితా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా.. మరోసారి మన్మధుడితో ప్రోమో షూటింగ్ కూడా పూర్తిచేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఈ షో మొదలు కానుందని తెలుస్తుండగా మరోవైపు కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈసారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఇప్పటికే ఓ జాబితా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ జాబితాలో కొందరు ఇప్పటికే మేమా బిగ్ బాస్ హౌస్ కా.. నెవెర్ అనేశారు. షోకు వెళ్లడం లేదన్న ఆ జాబితాలో ఇప్పుడు ఇషాచావ్లా పేరు కూడా యాడ్ అయింది. నెటిజన్లు ఇషా ఎంట్రీపై ప్రశ్నలు తట్టుకోలేక అసలు విషయం చెప్పేసింది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అబద్దమని.. ఈ సీజన్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో నేను లేనని.. షోకు తాను వెళ్లడం లేదని ఓపెన్ అయిపొయింది. దీంతో ప్రచారంలో ఉన్న జాబితాలో ఓ పేరు తగ్గినట్లయింది.

ప్రస్తుతం ప్ర‌చారమవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్ర‌కారం ఇక మిగిలిన వారిలో యాంకర్ రవి, షణ్ముఖ జస్వంత్, ఆర్జే కాజల్, నీనియర్ నటి ప్రియ, సిరి హన్ముంతు, 7 ఆర్ట్స్ సరయు, నవ్య స్వామి, కార్తీక దీపం ఫేమ్ ఉమ, కమెడియన్ లోబో, టీవీ నటుడు మానస్, మోడల్ జస్వంత్, టీవీ నటుడు సన్నీ, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, ప్రియాంక (ట్రాన్స్ జెండర్), న్యూస్ రీడర్ ప్రత్యూష, ఆట సందీప్/ రఘు మాస్టర్ ఉన్నారు.