Ishwarya Vullingala
Ishwarya Vullingala : సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య ఉల్లింగల జబర్దస్త్ షోతో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం పలు టీవీ షోలు, బయట ఈవెంట్స్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అవుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన గురించి పలు విషయాలు తెలిపింది.(Ishwarya Vullingala)
ఈ క్రమంలో ఐశ్వర్య ఉల్లింగల తన పేరెంట్స్ విడిపోయారని, తాను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చింది.
Also See : Priyanka Mohan : ఓజీ – కన్మణి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక మోహన్.. ఈ ఫొటోలు చూశారా?
ఐశ్వర్య ఉల్లింగల మాట్లాడుతూ.. నేను 16 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న విడిపోయారు. అప్పట్నుంచి అమ్మ నేను తమ్ముడు మాత్రమే ఉంటున్నాం. మా అమ్మ టీచర్ గా పనిచేసేది. 8000 జీతం వచ్చేది కానీ ఇంటి రెంట్ కి సరిపోయేది. ధైర్యంగా మా నాన్న నుంచి బయటకు వచ్చేసాం కానీ చాలా కష్టపడ్డాం. బతకడానికి చాలా చేసాను. చదువుకుంటూనే మెహందీ పెట్టడం, ట్యూషన్స్ చెప్పడం, ఈవెంట్స్ హోస్ట్ చేయడం.. ఇలా చాలా పనులు చేశాను.
ఓ సారి విజయవాడలో సీరియల్ ఆడిషన్స్ పెడితే వెళ్ళాను. అందులో సెలెక్ట్ అవ్వలేదు కానీ తర్వాత ఈటీవీలో సీరియల్ నుంచి కాల్ వచ్చింది. అలా కాంచనమాల సీరియల్ తో ఇండస్రీలోకి వచ్చాను. నేను యాంకర్ అవుదామనుకున్నాను. కానీ సీరియల్స్ వచ్చాయి చేశాను. ఇప్పుడు సినిమా, సిరీస్ ఛాన్సులు వస్తున్నాయి చేస్త్తున్నాను. ఇప్పుడు సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉండి సీరియల్స్ చెయ్యట్లేదు. ఖాళీ అయితే మళ్ళీ సీరియల్స్ చేస్తాను. బయట హోస్టింగ్ చేస్తున్నాను. జబర్దస్త్ వల్లే నాకు ఫేమ్ వచ్చింది. ఆది గారు ఓ మాల్ ఓపెనింగ్ ఈవెంట్లో పరిచయం అయ్యారు. ఆయన వల్లే జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యాను అని తెలిపింది.
Also Read : Serial Actress : సీరియల్స్ తో ఎంట్రీ.. సినిమాకు కమిట్మెంట్ అడగడంతో.. ఆ డైరెక్టర్ ని కొట్టిన నటి..
ఇప్పుడైతే తన కష్టాలు తీరిపోయాయి అని, తన తల్లిని బాగా చూసుకుంటున్నాను అని, ఇటీవలే ఓ కోటి రూపాయలు పైనే ఖర్చుపెట్టి ఇల్లు కట్టినట్టు, ఆ ఇంటికి చేసిన అప్పు తీర్చాలి ఇప్పుడు అని చెప్పుకొచ్చింది. ఆ అప్పు తీరాక మా అమ్మ చూసిన సంబంధం చేసుకుంటాను అని తెలిపింది ఐశ్వర్య.