గోవాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 11:29 AM IST
గోవాలో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’

Updated On : March 27, 2019 / 11:29 AM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరో హీరోయిన్స్‌గా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నెల రోజులుగా గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి గోవాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చార్మి ట్విట్టర్ ద్వారా తెలియస్తూ… గోవా షెడ్యూల్ పూర్తయిన వెంటనే అంతా కలిసి పార్టీ చేసుకున్నాం. డాన్స్ చేసి ఎంజాయ్ చేశాం. రామ్ తన స్మార్ట్ బీట్స్ వేస్తూ అదరగొట్టాడు అంటూ ట్వీట్ చేశారు. 

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరో రామ్‌ను స‌రికొత్త కోణంలో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాను వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 
Read Also : డ్యాన్స్ మాస్టర్ జానీకి జైలు శిక్ష