Abhishek Agarwal : పది రోజుల్లో సినిమా రిలీజ్.. టైగర్ నాగేశ్వరరావు నిర్మాత నివాసంలో ఐటి దాడులు..

టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

IT Raids on Producer Abhishek Agarwal House and Office

Abhishek Agarwal : ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో కూడా ప్రముఖుల ఇళ్లపై, ఆఫీసులపై ఇటీవల ఐటి దాడులు జరిగాయి. తాజాగా ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, ఆఫీసులో ఐటి సోదాలు జరిగాయి.

టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కార్తికేయ 2 సినిమాతో కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. త్వరలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రానున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకి భారీ బడ్జెట్ ని పెట్టారు.

Also Read : Ayalaan : శివకార్తికేయన్ అయలాన్ సినిమాలో ఏలియన్ గా నటించింది ఎవరో తెలుసా? మరుగుజ్జు నటుడు..

ఇలాంటి టైంలో అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, ఆఫీసులో ఐటి సోదాలు జరగడంతో చిత్రయూనిట్ కంగారుపడుతున్నారు. ఈ ఐటి దాడులపై ఇంకా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అభిషేక్ అగర్వాల్ కూడా ఇంకా దీనిపై స్పందించలేదు.