Allu Arjun : అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. AA22xA6

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది.

Its official Allu Arjun doing a film with Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 8). ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. గ‌త‌కొన్నాళ్లుగా త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది.

బ‌న్నీ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిర్మాణ సంస్థ ఓ వీడియోను విడుద‌ల చేసింది.

ఇందులో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేసింది. బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పింది.

పుష్ప 2 త‌రువాత అల్లు అర్జున్ న‌టిస్తున్నచిత్రం కావ‌డం, హిట్ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌డంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రంగా, అట్లీ కెరీర్‌లో 6వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.

PEDDI : షాక్‌లో ఫ్యాన్స్ .. రామ్‌చ‌ర‌ణ్‌ను వెంటాడుతున్న ఆ మ్యూజిక్‌..!

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌రు, కీల‌క పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టించ‌నున్నారు అనే విష‌యాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.