J D Chakravarthy receives award from Nigeria international film festival
J D Chakravarthy : RRR మూవీ ఆస్కార్ (Oscar) అందుకోవడంతో ఇండియన్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతుంది. దీంతో పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో మన సినిమాలు పురస్కారాలను అందుకుంటుంది. ఈ క్రమంలోనే బలగం (Balagam) సినిమా ఏకంగా 40 కి పైగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకొని సత్తా చాటింది. తాజాగా సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా అరుదైన అవార్డు లభించింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జేడి చక్రవర్తి అవార్డు అందుకున్నాడు.
Atharva : ఆదిపురుష్ పోటీ పడేందుకు సిద్దమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ అథర్వ..
సమాజంలోని వాస్తవ ఘటనలు ఆధారంగా సినిమాలు తెరకెక్కించే మలయాళ డైరెక్టర్ రాజేష్ టచ్‌రివర్ (Rajesh Touchriver) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దహిణి (Dahini). విచ్ హంటింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గాను జేడీ చక్రవర్తి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ చక్రవర్తి కంగ్రాట్యులేషన్స్ తెలియజేయగా.. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు జేడీకి అభినందనలు తెలుపుతున్నారు.
Bheems Ceciroleo : బలగం సంగీత దర్శకుడికి దాదాసాహెబ్ అవార్డు..
కాగా ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు గౌరవాలు దక్కించుకుంది. ఆస్ట్రేలియా టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని అందుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా నామినేట్ అయిన ఈ చిత్రం దాదాపు 18 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని అందుకుంటుందో చూడాలి.