Jabardasth Dhanaraj Tells about Megastar Chiranjeevi and Their First Meeting
Dhanaraj – Chiranjeevi : జబర్దస్త్ కమెడియన్ గా, పలు సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు, ఫేమ్ తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారి రామం రాఘవం సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనరాజ్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఓ ఇంటర్వ్యూలో ధనరాజ్ మాట్లాడుతూ.. నేను మా ఊరు హనుమాన్ జంక్షన్ లో చిరంజీవి సినిమాలు, పోస్టర్స్ చూసి చిరంజీవి అభిమానిగా సినిమాల మీద ఇష్టం పెంచుకొని హైదరాబాద్ వచ్చేసాను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరిక కానీ ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పటివరకు ఒకేఒక్కసారి చిరంజీవి గారిని కలిసాను అని తెలిపాడు.
ధనరాజ్ చిరంజీవితో మీటింగ్ గురించి చెప్తూ.. పని లేనిదే ఆయన్ని కలవకూడదు అని నేను అనుకున్నాను. చిరంజీవి గారిని ఒకేఒక్కసారి కలిసాను. రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. నేను, జోష్ రవి అక్కడే ఓ షో షూటింగ్ అయిపోయి బయట ఉన్నాం. అసలు నేను ఆయనకు తెలియదు. ఆయన నన్ను ఒకసారి కూడా డైరెక్ట్ గా చూడలేదు. స్టూడియోలో చిరంజీవి గారు వస్తున్నారంటే చూద్దామని ఓ పక్కన నిల్చొని చూస్తున్నాను. చిరంజీవి గారు అలా నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని దాటి వెళ్తూ మమ్మల్ని చూసారు. హే.. ధనరాజ్ బాగున్నావా అని ఆయనే పిలిచి మాట్లాడారు. అసలు నేను షాక్. నేను వెళ్లి నా పేరు మీకెలా తెలుసు సర్ అని అడిగితే మా నాగబాబు జబర్దస్త్ చూపిస్తాడు. మీ స్కిట్స్ చూసి నవ్వుకుంటాను. జగదేక వీరుడు అతిలోక సుందరి స్పూఫ్ స్కిట్ లో నీ లేడీ గెటప్ చూసి చాలా సార్లు నవ్వుకున్నాను అన్నారు.
Also Read : Taraka Ratna : నందమూరి తారకరత్న రెండవ వర్ధంతి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య అలేఖ్య..
నేను ఆయనకు తెలీదు కానీ టీవీలో చూసి నన్ను అంత గుర్తుపెట్టుకున్నారు అని షాక్ అయ్యాను. అప్పటికే నా ఫేవరేట్ హీరో చిరంజీవి గారిని కలిసి మాట్లాడుతున్నాను అని ఒక రకమైన ఫీల్ లో ఉన్నాను. నేనే సర్ మీరు వెళ్లిపోండి, మీరు ఎక్కువ సేపు ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది మిమ్మల్ని చూసిన ఆనందంలో అన్నాను. దానికి ఆయన నేను రాజకీయాలోకి వెళ్లి వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. ఇప్పుడు నేను హ్యాపీ అన్నారు. ఏంటి ఫోటో దిగవా అని ఆయనే అడిగి కెమెరామెన్ ని పిలిచి ఫోటో దింపారు. అదే ఫోటో అప్పట్నుంచి ఇప్పటికి నా ఫోన్ వాల్ పేపర్ అని చూపించారు.
అలా 2017 మీలో ఎవరు కోటీశ్వరుడు షూటింగ్ సమయంలో మెగాస్టార్ తో దిగిన ఫోటో ఇప్పటికి ఫోన్ వాల్ పేపర్ గా 8 ఏళ్లుగా మార్చకుండా పెట్టుకున్నాడు అంటే ధనరాజ్ అభిమానాన్ని మెచ్చుకోవలసిందే. మరి భవిష్యత్తులో అయినా ధనరాజ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తాడేమో చూడాలి.