Jabardasth Mahidhar
Jabardasth Mahidhar : జబర్దస్త్ కామెడీ షోతో తెరపైకి వచ్చిన కమెడియన్స్ లో మహీధర్ ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు మహీధర్. కానీ పలు కారణాలతో జబర్దస్త్ మానేసాడు. ప్రస్తుతం మహీధర్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని రివ్యూలు, ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.(Jabardasth Mahidhar)
అయితే మహీధర్ ఇటీవలే ఓ కేఫ్ బిజినెస్ కూడా ప్రారంభించాడు. మహీధర్ ప్రస్తుతం వైజాగ్ లోనే ఉంటున్నాడు. అక్కడే వైజాగ్ లోనే తన కొత్త బిజినెస్ ని ప్రారంభించాడు. తాజాగా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మహీధర్ తన సంపాదన గురించి, తన బిజినెస్ గురించి తెలిపాడు.
మహీధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను కేవలం యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే చేస్తున్నాను. కొత్తగా బిజినెస్ పెట్టాను. యూట్యూబ్ మీద నుంచి వచ్చిన డబ్బుతోనే బిజినెస్ పెట్టాను. యూట్యూబ్ లో నాలుగు ఛానల్స్ ఉన్నాయి. ఒక కోటి రూపాయలు పైనే యూట్యూబ్ నుంచి వచ్చింది. వైజాగ్ లో దర్ఫీ కేఫ్ అని ప్రారంభించాను. మహీధర్ లో ధర్, కాఫీలో ఫీ కలిపి దర్ఫీ అని పెట్టాను. అక్కడ కాఫీ, మిల్క్ షేక్స్, ఫుడ్ ఒక కేఫ్ లాగా అన్ని దొరుకుతాయి. వైజాగ్ జగదాంబ థియేటర్ దగ్గర్లో ఉన్న చిత్రాలయం మాల్ లో సెకండ్ ఫ్లోర్ లో పెట్టాను. బిజినెస్ బాగానే నడస్తుంది. వీకెండ్స్ లో ఇంకా బాగా నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ లో ఈ బిజినెస్ బయటకు ఇద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్, బిజినెస్ మీదే నా ఫోకస్ అని తెలిపాడు.