Chiranjeevi
Chiranjeevi : జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నరేష్. తన తక్కువ హైట్ ని కామెడీకి వాడుకుంటూ ఎదిగాడు. జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న నరేష్ ఇప్పుడు అపీలు టీవీ షోలు, బయట ఈవెంట్స్, అప్పుడప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.(Chiranjeevi)
తాజాగా నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు హీరోల గురించి మాట్లాడాడు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. ఆయనతో సినిమా చేయాలి. ఆయనతో కాటమ రాయుడు సినిమా ఛాన్స్ మిస్ అయింది. చేతి దాకా వచ్చి మిస్ అయింది. రేపు అర్జెంటు గా రావాలి షూట్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది అని ఫోన్ వచ్చింది. కానీ అప్పుడు నేను వేరే దేశంలో ఉన్నా సో అది మిస్ అయింది. ఆయనతో సినిమా వస్తే కళ్ళు మూసుకొని ఓకే చేస్తా. జబర్దస్త్ – పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకే రోజు డేట్స్ క్లాష్ అయినా నేను పవన్ గారి సినిమానే చేస్తా. నాకు అది డ్రీం. పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్ గారితో ఈ ఇద్దరు హీరోలతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక అని తెలిపాడు.
అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారే భోళా శంకర్ సినిమాలో స్వయంగా అడిగి నన్ను రిఫర్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అది ఎప్పటికి మర్చిపోలేను. సెట్ లోకి వెళ్ళాక నరేష్ ఎక్కడ ఎక్కడ అని అడిగారు. కిందకు చూడండి సర్ అని సరదాగా అన్నాను. నన్ను పిలిచి మాట్లాడారు. ఆయనే చెప్పి ఛాన్స్ ఇప్పించారు ఆ సినిమాలో. అది నాకు అదృష్టం అని అన్నాడు.
Also Read : Jabardasth Naresh : ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేష్..
అలాగే.. రవితేజ నా ఫేవరేట్ హీరో అని, ఒకేసారి కలిసాను అని, కలిసినప్పుడు దగ్గరకు తీసుకొని ఆయన స్టైల్ లో మాట్లాడి ఫోటో ఇచ్చారని తెలిపాడు నరేష్.