×
Ad

Jabardasth Naresh : మాది చెత్త బిజినెస్.. నరేష్ కష్టాలు.. అసలు ఏం చదువుకున్నాడు, జబర్దస్త్ కి ఎలా వచ్చాడో తెలుసా?

తాజాగా నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అసలు నరేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎలా ఇండస్ట్రీ కి వచ్చాడో తెలిపాడు. (Jabardasth Naresh)

Jabardasth Naresh

Jabardasth Naresh : జబర్దస్త్ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నరేష్. తను హైట్ తక్కువ ఉండటంతో ఆ హైట్ నే తనకు సపోర్ట్ గా మార్చుకొని కమెడియన్ అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రేదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు పలు టీవీ ఈవెంట్స్, బయట ఈవెంట్స్, అడదపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు నరేష్.

తాజాగా నరేష్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అసలు నరేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎలా ఇండస్ట్రీ కి వచ్చాడో తెలిపాడు.

Also Read : Chiranjeevi : చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చారు.. కానీ పవన్ కళ్యాణ్ ఛాన్స్ మిస్.. ఆ ఇద్దరు హీరోలతో ఎప్పటికైనా..

నరేష్ మాట్లాడుతూ.. నాన్నకు ట్రాలీ ఆటో ఉండేది. ఒకటి పాడైపోతే కొత్తది కొంటే EMI కట్టలేకపోతే ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. మాకు చిన్న స్క్రాప్ షాప్ ఉండేది. ఆ షాప్ కూడా అమ్ముకునే స్టేజ్ కి వెళ్ళాము. స్క్రాప్ బిజినెస్ మాది. మాకు, మా చుట్టాలకు చాలా మందికి అదే బిజినెస్. నేను కూడా అదే చేశాను. పాత పేపర్లు, ఇనుము, బీర్ బాటిల్స్.. ఇలా చెత్త ఐటమ్స్ కొని అమ్ముతాము. నేను తొమ్మిదో తరగతి వరకే చదివాను, అప్పటికే కష్టాలు ఉన్నాయి. చదివించలేరు. అందుకే చదువు మానేసాను, నాకు పెద్దగా చదువు రాదు అని తెలిపాడు.

ఇక తను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడో నరేష్ చెప్తూ.. నేను ఇంట్లో నేర్చుకొని డ్యాన్సులు వేసేవాడ్ని. ఢీ జూనియర్స్ ఆడిషన్స్ యాడ్ చూసి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేసాను. కానీ రిజెక్ట్ చేసారు. అక్కడ బయట తిరుగుతుంటే ఓ ప్రొడక్షన్ ఆయన డ్యాన్స్ ఒక్కటేనా ఏదైనా చేస్తావా అని అడిగితే ఏదైనా చేస్తా అన్నాను. సరే అని నా నంబర్ తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ షూట్ ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు సుధాకర్ అన్న చూసి యాక్టివ్ గా ఉన్నాను అని తీసుకొచ్చి చంటి అన్నకు పరిచయం చేసి ఒక స్కిట్ లో వేయించారు. ఆ తర్వాత ప్రకాష్ స్కిట్స్ లో చేశా. తర్వాత బుల్లెట్ భాస్కర్ – సుధాకర్ టీమ్ లీడర్స్ అవ్వడంతో వాళ్ళ టీమ్ లోకి వెళ్ళాను. అక్కడ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని తెలిపాడు.

Also Read : Jabardasth Naresh : ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేష్..