Jabardasth pavithraa : కాబోయే భర్తతో జబర్దస్త్ నటి రొమాంటిక్ డాన్స్.. వీడియో వైరల్..

ఇటీవలే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన జబర్దస్త్ నటి పవిత్ర.. తనకి కాబోయే భర్తతో కలిసి రొమాంటిక్ పాటకి డాన్స్ వేసిన వీడియో షేర్ చేశారు.

Jabardasth pavithraa shares romantic dance video with her fiance

Jabardasth pavithraa : జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ ని సంపాదించుకున్న పవిత్ర.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవలే వారి ప్రేమ విషయాన్ని, పెళ్లి విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశారు. సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. పెళ్లి తేదీని ఇంకా తెలియజేయని ఈ జంట.. ప్రస్తుతం లవ్ లైఫ్ ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా పవిత్ర ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో పవిత్ర తన కాబోయే భర్త సంతోష్ తో కలిసి.. లోఫర్ మూవీలోని రొమాంటిక్ సాంగ్ ‘జియా జలే’ సాంగ్ కలిసి డాన్స్ వేశారు. అయితే సంతోష్ కి మాత్రం డాన్స్ వేయడం చేతకావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూనే పవిత్ర ఇలా రాసుకొచ్చారు.. “కొన్ని సిట్యువేషన్స్ లో మనకి డాన్స్ వేయడం రానప్పుడు ఎం చెయ్యాలో తెలుసా.. డాన్స్ వచ్చినట్లు మ్యానేజ్ చెయ్యాలి. కానీ మనం బాగా ట్రై చేశాం సంతోష్” అంటూ సరదా కామెంట్ రాసుకొచ్చారు.

Also read : Tollywood : 2023లో అదరగొట్టిన కొత్త దర్శకులు.. ఆ డైరెక్టర్స్ ఎవరో చూసేయండి..

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా పవిత్రకి సంతోష్ ముందుగా తన ప్రేమని ప్రపోజ్ చేశారు. కొంత కాలం తరువాత పవిత్ర కూడా ఓకే చెప్పడం, వన్ ఇయర్ లవ్ రిలేషన్ తో తరువాత ఎంగేజ్మెంట్ రింగ్ లు మార్చుకొని పెళ్లి జీవితానికి మొదటి అడుగు వేశారు. మరి ఈ ఇద్దరు ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్నారు. పాగల్ పవిత్ర పేరుతో పవిత్ర ఒక యూట్యూబ్ ఛానల్ ని నడుపుతున్నారు. ఇటీవల తన బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న వీడియోని షేర్ చేయగా.. దానికి వేళల్లో వ్యూస్ వచ్చాయి.