Jabardasth Rakesh – Jordar Sujatha : ఎంగేజ్‌మెంట్‌తో ఒకటైన జబర్దస్త్ జంట..

జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ రింగులు మార్చుకొని ఒక్కటయ్యారు.

Jabardasth Rakesh Jordar Sujatha got engaged

Jabardasth Rakesh – Jordar Sujatha : జబర్దస్త్ కామెడీ షోలో పిల్లలు చేత కూడా కామెడీ చేయించి నవ్వులు పూయించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్న కమెడియన్ ‘రాకింగ్ రాకేష్’. ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి ‘జోర్దార్ సుజాత’ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ ‘సుజాత’. కాగా గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ, డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల దీని పై స్పందిస్తూ సుజాత తన యూట్యూబ్ ఛానల్ లో ‘మా ప్రేమ ప్రయాణం గమ్యానికి చేరింది’ అంటూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

Jabardasth Rakesh and Sujatha : ప్రియురాలి పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన జబర్దస్త్ రాకేష్..

తాజాగా నేడు వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ వేడుకకు రాకేష్ అండ్ సుజాత కుటుంబ సభ్యులతో పాటు జబర్దస్త్ నటులు కూడా హాజరయ్యి సందడి చేశారు. మినిస్టర్ రోజా, అనసూయ, యాంకర్ రవి, అదిరే అభి, గెటప్ శీను తదితరులు ఈ ఎంగేజ్‌మెంట్‌ కి హాజరయ్యారు. వీరందరి మధ్యలో ఎంగేజ్‌మెంట్‌ రింగులు మార్చుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు రాకేష్, సుజాత. ఈ ఎంగేజ్‌మెంట్‌ కి సంబంధించిన ఫోటోలను యాంకర్ రవి పోస్ట్ చేస్తూ ఈ ప్రేమ జంటకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్లు కూడా ఈ జబర్దస్త్ జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ‘జోర్దార్ సుజాత’ గా ఫేమ్ ని సంపాదించుకున్న సుజాత.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకొని హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వచ్చిన పాపులారిటీతో జబర్దస్త్ షో వరకు చేరుకుంది. ఆ సమయంలోనే రాకేష్ తో సుజాతకి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అయితే వీరిద్దరూ ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.